Thursday, March 12, 2026 09:28 PM
Thursday, March 12, 2026 09:28 PM

వైసీపీ వారికి మాత్రమే ఎంట్రీ..!

ఆ మంత్రి గారి పేషీలోకి కేవలం వైసీపీ వారికి మాత్రమే ఎంట్రీ ఉంటుందట.. టీడీపీ అంటే నో ఎంట్రీ ప్లీజ్ అంటారంట.. ఇదే ఇప్పుడు మంగళగిరి పార్టీ కార్యాలయంలో, సచివాలయంలో జోరుగా జరుగుతున్న చర్చ. యధా మంత్రి.. తథా పేషీ అధికారులు.. అంటున్నారు. మంత్రి తీరు, వ్యవహార శైలికి అనుగుణంగానే పేషీ అధికారులు ప్రవర్తిస్తున్నారనే మాట బాగా వినిపిస్తోంది. తాంబూలం ఇవ్వకపోతే.. కనీసం ఫైలు మీద దుమ్ము కూడా దులపరట. అది కూడా వైసీపీ అభిమాన అధికారులకు సంబంధించిన ఫైళ్లు మాత్రమే. అదే టీడీపీ, జనసేన అభిమాన అధికారుల ఫైళ్లు అయితే.. నత్తతో పోటీ పడుతుంటాయి.

Also Read : బ్రేకింగ్: పాదయాత్రకు సిద్దమవుతోన్న కేటిఆర్..?

పైళ్ల పరిష్కారంలో మంత్రి పేషీ అధికారులను భారీ కానుకలతో ప్రసన్నం చేస్తేనే ఎలాంటి పనులయినా క్షణాల్లో పరిష్కరం అవుతాయంట. టీడీపీ ఎమ్మెల్యేలు, కూటమి మంత్రులు, టీడీపీ, జనసేన నాయకుల సిపార్సుల కంటే కూడా.. వైసీపీ మాజీ మంత్రులు, ఆ పార్టీ నాయకుల సిఫార్సుల ప్రభావమే ఎక్కువగా పనిచేస్తుందా అనే అనుమానం కలుగుతుంది. ఇక అసలు విషయం ఏమిటంటే, ఆ మంత్రి పేషీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారుల్లో ఒక్కరు కూడా టీడీపీ అభిమానులు లేరట. ఉన్న వారంతా సీఎం చంద్రబాబు వ్యతిరేకులు.. మాజీ సీఎం జగన్ రెడ్డి అభిమానులే అక్కడ కన్పిస్తున్నారట. వైసీపీ అభిమాన అధికారులకే ఆ మంత్రి గారి పేషీలో రెడ్ కార్పెట్ పరుస్తున్నారట. టీడీపీ, జనసేన అభిమాన అధికారులను అంటరానివారిగా చూస్తున్నారు.

Also Read : మలబద్దకానికి జుట్టు రాలడానికి లింక్ ఉందా..?

మంత్రి గారికి కూడా టీడీపీ కంటే వైసీపీ అంటేనే ఎక్కువ అభిమానం ఉందా అనే అనుమానం వస్తుంది. ఇంతకు ఆ మంత్రి ఎవరని అనుకుంటున్నారా.. ఆయనే రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఆయన పేషీ అధికారుల అవినీతి, అక్రమాలపై ఇప్పటికే మీడియాలో అనేక కధనాలు వచ్చాయి. అయినా సరే.. ఆ మంత్రి కనీసం లెక్క చేయటం లేదు. సీఎం చంద్రబాబు కూడా పట్టించుకోవటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. అటు సీఎంఓ అధికారులు కూడా దృష్టి పెట్టకపోవటంతో మంత్రితో పాటు ఆయన పేషీ వైసీపీ అభిమాన అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తున్నారు అనేది సచివాలయ వర్గాల్లో వినిపిస్తున్న మాట.

మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా సరే.. రాంప్రసాద్ రెడ్డి పదవి పోవటం ఖాయమే. సీఎం చంద్రబాబు తొలిగించాలనుకుంటున్న మంత్రులు ఎవరెవరు ఉన్నారో తెలియదు కానీ.. ఆ జాబితాలో రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరు మాత్రం తొలగింపు మంత్రుల జాబితాలో తప్పనిసరిగా ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. రాంప్రసాద్ రెడ్డిని మంత్రి పదవి నుండి తొలిగించి.. ఆయన స్థానంలో కడప రెడ్డెమ్మను మంత్రిగా తీసుకోవటం ఖాయం అని టీడీపీ సీనియర్ నేతలు చెబుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఏఐఎస్ అంటే ఏంటీ..?...

ఇరాన్ – ఇజ్రాయిల్ దేశాల మధ్య...

ముహుర్తం ఖరారు.. మార్చి...

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగం రూపురేఖలు మారబోతున్నాయి....

ఏపీ మంత్రుల ప్రోగ్రెస్...

ఆంధ్రప్రదేశ్ లో మంత్రుల పని తీరును...

బ్రేకింగ్: భారత నౌకలకు...

ఇజ్రాయిల్ – ఇరాన్ దేశాల మధ్య...

లోకేష్ సీఎం.. ముహూర్తం...

​బీహార్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్...

బ్రేకింగ్: పాదయాత్రకు సిద్దమవుతోన్న...

తెలంగాణలో భారత రాష్ట్ర సమితిని తిరిగి...

పోల్స్