Monday, August 3, 2026 11:44 AM
Monday, August 3, 2026 11:44 AM

బ్రేకింగ్: భారత నౌకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్

ఇజ్రాయిల్ – ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న యుద్ద తీవ్రత నేపధ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత వారం నుంచి హార్మోజ్ జలసంధిలో అన్ని దేశాల నౌకలకు ఇరాన్ అనుమతి నిరాకరించింది. సముద్రంలో మైన్స్ ఏర్పాటు చేయడంతో పరిస్థితి ఆందోళన కలిగించింది. ఆ మార్గం నుంచి వెళ్ళే నౌకలను పేల్చేస్తామని ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ లు ఇస్తోంది. దీనిపై భారత ప్రభుత్వం ఇరాన్ తో సంప్రదింపులు జరిపే ప్రయత్నం చేస్తూ వచ్చింది. దేశంలో ఇంధన కొరత తీవ్రమవుతోందనే ఆందోళన కూడా కనపడుతోంది.

Also Read : మలబద్దకానికి జుట్టు రాలడానికి లింక్ ఉందా..?

ఈ నేపథ్యంలో భారత్ కు ఉపశమనం కలిగించేలా, ఇరాన్.. భారత జెండా కలిగిన ట్యాంకర్లను హార్ముజ్ జలసంధి గుండా వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి మధ్య జరిగిన చర్చల తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. అమెరికా, యూరప్, ఇజ్రాయెల్ నుండి వచ్చిన ఓడలు ఆంక్షలను ఎదుర్కొంటున్నప్పటికీ, రెండు భారతీయ ట్యాంకర్లు, పుష్పక్, పరిమల్, వ్యూహాత్మకంగా కీలకమైన జలసంధి గుండా సురక్షితంగా ప్రయాణం మొదలుపెట్టాయి.

Also Read : హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్న సింగర్ కాలభైరవ

సౌదీ అరేబియా ముడి చమురును రవాణా చేస్తున్న లైబీరియన్ జెండా కలిగిన ట్యాంకర్, రెండు రోజుల క్రితం హార్ముజ్ జలసంధిని నుంచి ముంబై ఓడరేవులో ఆగింది. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడి చేసినప్పటి నుండి సముద్ర రాకపోకలు దాదాపుగా నిలిచిపోయే పరిస్థితి. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో హార్ముజ్ జలసంధి గుండా నౌకల ప్రయాణంపై ఇరాన్ తన ఆంక్షలను తీవ్రతరం చేసింది. రోజుకు దాదాపు 13 మిలియన్ బ్యారెళ్ల చమురు సాధారణంగా ఈ జలాల ద్వారా రవాణా అవుతుంది. ఇది ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 31 శాతం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఉరవకొండలో పొలిటికల్ హీట్.....

ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాజకీయ వాతావరణం...

ఉత్తరాంధ్ర కాదు.. ఇక...

విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి...

ఇదీ ఉత్తరాంధ్ర దెబ్బ.....

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ...

మోడీని దారుణంగా మాట్లాడారు.....

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ...

భోగాపురంలో చరిత్ర సృష్టించిన...

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారమవుతూ,...

అంతర్జాతీయ అద్భుతం.. మన...

విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా...

పోల్స్