Friday, May 1, 2026 08:57 AM
Friday, May 1, 2026 08:57 AM

ఆఫ్ ది రికార్డు.. కొలికపూడి గురించే..!

తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గురించి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనే జోరుగా చర్చ నడుస్తోంది. పైకి అందరూ నవ్వుతూ పలకరిస్తున్నప్పటికీ.. కొలికపూడి అటుగా వెళ్లగానే.. చెవులు కొరుక్కుంటున్నారు. ఒకరు సస్పెన్షన్ అంటారు.. మరొకరు అదేం లేదంటారు.. ఇంతకీ తెర వెనుక ఏం జరుగుతుందనే విషయం ఎవరికీ అర్థం కావటం లేదు. ఏడాదిన్నర కాలంలో కొలికపూడి ఇప్పటికే టీడీపీ క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరై వివరణ ఇచ్చుకున్నారు. మరోసారి ఇలా చేయను.. అంటూనే.. మళ్లీ మళ్లీ చేస్తున్నారు. దీంతో ఇక మాటల్లేవ్ అనేశారు ఏపీ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు. దీంతో హడావుడిగా అసెంబ్లీలోనే పల్లాను కలిసిన కొలికపూడి.. నెమలి ఘటనపై వివరణ ఇచ్చారు. మరోసారి జరగదు అంటూ మళ్లీ హామీ ఇచ్చారు.

Also Read : లక్ష్మీ దుర్గ ఎక్కడ.. పోలీసులకు నిజంగా తెలియదా..?

ఇక ఆఫ్ ది రికార్డు విషయం ఏమిటంటే.. కొలికపూడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పార్టీ జాతీయ అధ్యక్షులు, సీఎం చంద్రబాబును జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ కోరారంట. తనకు అత్యంత సన్నిహితుడైన విజయవాడ ఎంపీ కేశినేని చిన్నీకి కొలికపూడి కొరకరాని కొయ్యగా తయారయ్యాడనేది లోకేష్ ఫిర్యాదు. అందుకే కొలికపూడిని సస్పెండ్ చేయమని ప్రధాన కార్యదర్శి హోదాలో అధ్యక్షుల వారిని లోకేష్ కోరారంట. అయితే చంద్రబాబు మాత్రం.. సింపుల్‌గా “నో” అనేశారు అనేది పార్టీలో జరుగుతున్న చర్చ. “కొలికపూడిని సస్పెండ్ చేస్తే.. చిన్నీని కూడా చేయాల్సి ఉంటుంది.” అని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

Also Read : తమిళనాట ఏపీ ఫార్ములా.. పవన్ తో విజయ్ కు గాలం..?

చిన్నీని వదిలేసి.. ఎస్సీ వర్గానికి, అది కూడా దండోరా వర్గానికి చెందిన కొలికపూడిని సస్పెండ్ చేస్తే.. ఇప్పటికే కమ్మ పక్షపాతి అనే పేరున్న చంద్రబాబుపై మరిన్ని విమర్శలు రావటం ఖాయం. అపార రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు ఈ విషయం తెలుసు. అందుకే ఆయన అంగీకరించలేదంట. టీడీపీ వెంటే ఉన్న దండోరా సామాజిక వర్గం ఓటర్లలో వ్యతిరేకత రాకుండా ఉండాలంటే.. కొలికపూడికి వార్నింగ్ ఇస్తే సరిపోతుందని కూడా చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. లోకేష్ మాత్రం.. కంట్లో నలుసులా మారిన కొలికపూడిపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. అందుకే దూకుడుగా నిర్ణయం తీసుకుందామని చంద్రబాబుకు సూచించగా.. కులాల లెక్కలు బాగా తెలిసిన చంద్రబాబు.. మరోసారి రాజకీయ తప్పటడుగు పడకుండా జాగ్రత్త పడినట్లు సన్నిహితుల మాట. తన సన్నిహితుడైన చిన్నీ కోసం లోకేష్ తాపత్రయ పడినా.. సకాలంలో సరైన నిర్ణయం తీసుకొని కులపరమైన వివాదాలు తలెత్తకుండా లౌక్యం ప్రదర్శించి, సమయస్ఫూర్తిగా ఆ వివాదానికి తెర దించారు చంద్రబాబు అనేది పార్టీలో వినిపిస్తున్న మాట.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అబార్షన్ చట్టంపై సుప్రీంకోర్టు...

14 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్...

ఏపీ బ్రాండ్‌కి సచిన్‌...

నారా లోకేశ్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు చూడటానికి...

తల్లికి వందనం అప్పుడే.....

2026-27 విద్యా సంవత్సరం నేపథ్యంలో కూటమి...

మరో పార్టీ నేతను...

రాజకీయాల్లో ఇప్పుడు విపరీత ధోరణి కనిపిస్తోంది....

టెన్త్ ఫలితాల్లో లోకేష్...

ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్...

చేసిన పాపం.. కార్యకర్తల...

వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా మాజీ ఇన్ఛార్జ్...

పోల్స్