Friday, June 19, 2026 01:16 PM
Friday, June 19, 2026 01:16 PM

అర్ధరాత్రి ఆకలి వేస్తుందా..? అయితే ఏదో తేడా ఉన్నట్లే..!

అర్ధరాత్రి సమయంలో చాలా మంది ఆకలిగా ఉండి.. అందరూ పడుకున్న తర్వాత లైట్లు వేసుకుని వంట గదిలో సైలెంట్ గా తింటూ ఉంటారు. అదే పట్టణాల్లో అయితే.. మిడ్ నైట్ ఫుడ్ కోర్ట్ ల వద్ద, బిర్యాని, షావర్మా, ఇడ్లీ, దోశ వంటివి తింటూ కనపడతారు. మరి అర్ధరాత్రి ఆకలి కావడం.. నిజంగా ఆకలేనా..? కాదు అదో రోగం అని తేల్చేసారు నిపుణులు. ఏంటో అది ఈ స్టోరీలో చూద్దాం. జీర్ణక్రియ సమస్యలు, హార్మోన్ లు సక్రమంగా లేకపోవడం వంటివి ఇలా ఆకలికి కారణం అవుతాయి.

Also Read : తమిళనాట ఏపీ ఫార్ములా.. పవన్ తో విజయ్ కు గాలం..?

సాధారణంగా మన శరీరంలో ఆకలి ఓ గడియారాన్ని ఫాలో అవుతుంది. ఆకలి అనేది.. సంతృప్తి, జీవక్రియను ప్రభావితం చేసే అనేక హార్మోన్ల ద్వారా కంట్రోల్ అవుతుంది. ఈ వ్యవస్థలకు అంతరాయం కలిగించినప్పుడు, నిద్ర లేకపోవడం, జీవక్రియ రుగ్మతలు లేదా హార్మోన్ల మార్పులు వంటివి.. లేట్ నైట్ ఆకలికి కారణం అయ్యే ఛాన్స్ ఉంది. మన ఆకలిని.. గ్రెలిన్, లెప్టిన్, ఇన్సులిన్, కార్టిసాల్ వంటి హార్మోన్లు మార్గనిర్దేశం చేస్తాయి. మనం తిన్నప్పుడు సంతృప్తి కలిగింది అనే భావన కలిగించే హార్మోన్ లు ఇవే.

Also Read : ఇదేం క్రేజ్ దురంధర్.. రిలీజ్ కు ముందే రికార్డులు..!

మనం ఎప్పుడు, ఎలా తింటున్నామనే దానితో పాటు మనం ఏమి తింటున్నామనే విషయం కూడా అంతే ముఖ్యం అని పరిశోధనలు చెప్తున్నాయి. సాయంత్రం ఆలస్యంగా తినడం వల్ల ఆకలి పెరుగుతుందని, శరీరం కేలరీలను సమర్థవంతంగా బర్న్ చేసే సామర్థ్యాన్ని కోల్పోతుందని వైద్యులు అంటున్నారు. ఇదే బరువు పెరగడాన్నికి కూడా దారి తీసే అవకాశం ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. అంతర్లీనంగా మనలో ఉన్న అనారోగ్యాలు కూడా ఆకలికి కారణం అవుతాయి. రోజు ఆలస్యంగా తింటే.. ఎప్పుడు పడితే అప్పుడు ఆకలి అవుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

‘పెద్ది’కి బిగ్ సర్‌ప్రైజ్.....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

రఘురామ కేసుపై హైకోర్ట్...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్‌...

ఏపీ లిక్కర్ స్కామ్‌లో...

ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం రవాణా...

ప్రజల్లోకి వెళ్ళాల్సిందే.. చంద్రబాబు...

ఏపీలో అధికారుల తీరుపై విమర్శలు వస్తున్న...

పోల్స్