Friday, June 19, 2026 03:19 PM
Friday, June 19, 2026 03:19 PM

ఆఫ్ ది రికార్డు.. ఇంతకూ ఆయన మతమేంటి..?

ఆఫ్ ది రికార్డుగా కొన్ని వార్తలు.. ముందుగా కాలకేయ మిశ్రా అలియాస్ ఐఏఎస్ కార్తికేయ మిశ్రాను సీఎంఓ నుండి వెంటనే తప్పించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారట. అయితే ఈ విషయం తెలుసుకున్న మంత్రి నారా లోకేష్ మాత్రం.. ఆయనను సీఎంఓ నుంచి తప్పించవద్దని కోరినట్లు ఇప్పుడు సచివాలయ వర్గాల్లో జోరుగా ప్రచారం నడుస్తోంది. నిజానికి కార్తికేయ మిశ్రా పైన తొలి నుంచి విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు కూడా ఆయనను తొలగించకపోతే.. మరింత రెచ్చిపోతారని భావిస్తున్నారట.. నిజానికి గతంలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పట్ల దురుసుగా ప్రవర్తించినప్పుడే మిశ్రాను తొలగించి ఉంటే.. ఈ రోజు పరిస్థితి ఇంత వరకు వచ్చేది కాదు కదా అని పొలిటికల్ సర్కిల్‌లో కూడా జోరుగా చర్చ నడుస్తోంది. ఇప్పటి వరు ఎన్నో తప్పులు చేసిన మిశ్రాను భరించటమే చంద్రబాబు చేస్తున్న అతి పెద్ద తప్పు అని టీడీపీ నేతలే ఆఫ్ ది రికార్డు కామెంట్లు చేస్తున్నారు.

Also Read : వైసీపీని వణికిస్తున్న చంద్రబాబు ఫినామినా..!

ఆయనకు రెండు పోస్టులు కావాలంట..!

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపై సీఎం చంద్రబాబుతో సీయస్ సాయిప్రసాద్ భేటీ కానున్నారు. సాయి ప్రసాద్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి కంటే ముందు రెవెన్యూ శాఖాధిపతి పోస్టుతో పాటు ఇరిగేషన్ శాఖాధిపతి పోస్టు కూడా నిర్వహించారు. ఇప్పుడు ఆ రెండు పోస్టులను కూడా తానే నిర్వహించాలని సాయిప్రసాద్ కోరుకుంటున్నట్లు ఐఏఎస్ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇందుకు చంద్రబాబు అంగీకరిస్తారా..? ఒకవేళ సీఎం చంద్రబాబు “నో ” అంటే ఇరిగేషన్ శాఖాధిపతి పోస్టు వద్దు.. రెవెన్యూ శాఖాధిపతి పోస్టు ముద్దు అని సాయిప్రసాద్ భావిస్తున్నారా.. ?.

Also Read : చంద్రబాబు ఖాతాలో మరో రికార్డ్.. ఫస్ట్ ఛాన్స్ చంద్రబాబుకే..!

సీఎస్ పోస్టుకు రెవెన్యూ శాఖాధిపతి పోస్టు కూడా తోడయితే మొత్తం కలెక్టర్ వ్యవస్థ తన గుప్పిట్లో ఉంటుందనే విషయం సాయిప్రసాద్‌కు బాగా తెలుసు. అందుకే ఆ పదవి కోరుకుంటున్నారా అని ఆఫ్ ది రికార్డు చర్చ నడుస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో కొంత కాలం, రెవెన్యూ శాఖాధిపతి పోస్టులో, సీసీఎల్ఏ పోస్టులో అంటే రెండు పోస్టుల్లో సాయి ప్రసాద్ కొనసాగిన విషయం చంద్రబాబుకు తెలియక పోవచ్చు..? రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014 – 2019 మధ్య కాలంలో అప్పటి సీఎం చంద్రబాబు పేషీలో సీఎంఓ కార్యదర్శిగా సాయిప్రసాద్ పనిచేశారు కూడా. మరి అలాంటి సాయిప్రసాద్‌ ఇప్పుడు రెండు పోస్టులు ఎందుకు అడుగుతున్నారనేది ఆఫ్ ది కార్డు చర్చ జోరుగా వినిపిస్తోంది.

Also Read : ఫైనల్ మ్యాచ్‌కు జగన్.. దారి ఖర్చులు మావే..!

ఇంతకూ ఆయన మతమేంటి..?

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు మీరు కూడా క్రిస్టియన్ అని మంత్రి అచ్చెన్నాయుడు చేసిన కామెంట్‌ను తప్పుబట్టిన శాసన మండలి చైర్మన్ కోయ మోషేన్ రాజు.. తాను పక్కా హిందువు అంటూ బల్లగుద్ది మరీ చెప్పారు. అంతే.. ఆ మరుసటి రోజు నుంచే.. ఆయన పక్కా క్రిస్టియన్ అని సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. ఆయన చర్చిలో చేస్తున్న ప్రార్థనల ఫోటోలు, ఆయన ఛాంబర్‌లో క్రైస్తవ సూక్తులు ఉన్న ఫోటోలు బయటపెట్టారు టీడీపీ అభిమానులు. దీంతో అసలు ఆయనది క్రిస్టియన్ మతమా.. హిందూ మతమా..? అని జోరుగా చర్చ నడుస్తోంది. ఈ విషయంపై శాసనమండలి చైర్మన్ మోషెన్ రాజు క్లారిటీ ఇస్తే బాగుంటుందని ఆఫ్ ది రికార్డు చర్చించుకుంటున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

‘పెద్ది’కి బిగ్ సర్‌ప్రైజ్.....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

రఘురామ కేసుపై హైకోర్ట్...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్‌...

ఏపీ లిక్కర్ స్కామ్‌లో...

ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం రవాణా...

పోల్స్