Wednesday, March 4, 2026 10:37 PM
Wednesday, March 4, 2026 10:37 PM

కార్యకర్త కొడుకు కోసం లోకేష్.. అసెంబ్లీకి లోకేష్ రిక్వెస్ట్

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన దారుణ ఘటనలలో ఒకటి.. టీడీపీ కార్యకర్త తోట చంద్రయ్యను దారుణంగా హత్య చేయడం. ఈ ఘటనలో చంద్రయ్యను గొంతు కోసి ప్రాణం తీసారు వైసీపీ కార్యకర్తలు. ఈ కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో.. పట్టించుకోకపోవడం, వైసీపీ నేతలను కాపాడే ప్రయత్నం చేయడం సంచలనం అయింది. ఇక ఈ ఘటన తర్వాత టీడీపీ కార్యకర్తలు మరింత దూకుడు పెంచిన మాట వాస్తవం. చంద్రయ్య కుటుంబానికి ఆ రోజు నుంచి టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి అండగా నిలబడ్డారు.

Also Read : ఇరాన్ దెబ్బకు.. అమెరికా – ఇజ్రాయిల్ అధినేతల మధ్య గ్యాప్..?

ఇటు అధిష్టానం కూడా కుటుంబానికి ఆర్ధిక సహాయం చేసింది. ఇదిలా ఉంచితే తాజాగా ఏపీ అసెంబ్లీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ హయాంలో హత్యకు గురైన టీడీపీ నేత చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనే బిల్లు ప్రవేశపెట్టారు మంత్రి నారా లోకేష్. గతంలో బిల్లు ఆమోదించి మండలికి ఏపీ అసెంబ్లీ పంపగా.. అప్పట్లో బిల్లును వైసీపీ ఎమ్మెల్సీలు తిరస్కరించారు. ఇవాళ అసెంబ్లీలో మళ్లీ బిల్లు ప్రవేశపెట్టి, వెంటనే ఆమోదించి.. బిల్లును మండలికి పంపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Also Read : రైతులకు ఇచ్చిన డ్రోన్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

బిల్లును మండలి ఆమోదించకపోయినా 30 రోజుల తర్వాత ఆమోదించినట్లుగానే పరిగణించాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. బిల్ ప్రవేశ పెట్టిన సందర్భంగా మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీ పబ్లిక్ సర్వీస్ నియామకాల చట్ట సవరణకు అసెంబ్లీలో బిల్లును ప్రవేశ పెట్టిన లోకేష్.. బీసీ వర్గానికి చెందిన తోట చంద్రయ్యను 2022 జనవరి 12న హత్య చేశారని మండిపడ్డారు. ‘జై జగన్’ అంటే వదిలేస్తామని చెప్పినా, చంద్రయ్య భయపడలేదని, చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇచ్చేందుకు కూటమి భాగస్వామ్య పార్టీలు సమ్మతించాయని, చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే బిల్లును ఆమోదించాలని అసెంబ్లీని కోరుతున్నాను అన్నారు. ఫ్యాక్షన్‌కు అడ్డుకట్ట వేసి.. ఇలాంటి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నా అని లోకేష్ వ్యాఖ్యలు చేసారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

నానీ యాక్టివ్ అవ్వడానికి...

2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వైసీపీ...

ఈ చైర్మన్ మాకు...

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్...

మండలిలో వైసీపీ సభ్యుల...

దేవుడంటే మా కుటుంబానికి అపారమైన గౌరవం...

విజయవాడకు మరో మెగా...

కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత...

ఆ విషయంలో బతికిపోయిన...

ఏపీలో ఎన్నికలకు ఇంకా మూడేళ్లకు పైగా...

రైతులకు ఇచ్చిన డ్రోన్లు...

ప్రతి పనిలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలనేది...

పోల్స్