Thursday, September 17, 2026 10:41 PM
Thursday, September 17, 2026 10:41 PM

అమెరికాను వణికిస్తున్న ఇరాన్ చౌక డ్రోన్లు..!

పోరాడితే పోయేది ఏం ఉందనుకున్న ఇరాన్.. తమ వద్ద ఉన్న ఆయుధ సంపత్తిని ప్రయోగిస్తూ అమెరికా – ఇజ్రాయిల్ దేశాలకు చుక్కలు చూపిస్తోంది. ఇప్పుడు వాళ్ళ వద్ద ఉన్న అస్త్రం మాత్రం వైట్ హౌస్ ను కలవరపెడుతోంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్.. షాహెద్ డ్రోన్ లను ప్రయోగిస్తోంది. ఈ డ్రోన్ ఖర్చు చాలా తక్కువ. 16 లక్షల రూపాయలకు తయారు అయ్యే ఈ డ్రోన్ ను అమెరికా రాడార్లు గుర్తించడంలో ఫెయిల్ అవుతున్నాయి. లోహాలను మాత్రం గుర్తించే రాడార్ లు.. ఫైబర్ తో తయారు చేసే డ్రోన్ ను గుర్తించడంలో ఫెయిల్ అయ్యాయి.

Also Read : డేటాతో చేసిన దాడి: ఖచ్చితత్వంతో ఖమేనీ అంతం!

అవి భూమికి చాలా తక్కువ ఎత్తులో ఎగురుతూ తమ లక్ష్యాలను చేధిస్తున్నాయి. లక్ష్యం దగ్గరకు వెళ్లి పేలి పోయి.. భారీ నష్టాన్ని మిగులుస్తాయి. ఇరాన్.. గల్ఫ్ రాష్ట్రంలో వందలాది షాహెద్ డ్రోన్లను ప్రయోగించింది, వాటిలో 90% తమ లక్ష్యాలను చేధించాయి. వాటిని అడ్డుకోవడమే ఇప్పుడు ప్రధాన సమస్య. అమెరికా, దాని మిత్రదేశాలు సాధారణంగా బాంబు దాడుల నుండి రక్షించడానికి విమానాలను లేదా పేట్రియాట్ వైమానిక రక్షణ వ్యవస్థను మోహరిస్తాయి. ఇప్పుడు వాటి ఖర్చు.. డ్రోన్ కంటే 10 రెట్లు ఎక్కువ.

Also Read : రాజకీయాల నుంచి విజయ్ అవుట్.. తండ్రి మద్దతు కోడలికే

ఇరాన్ వద్ద భారీగా డ్రోన్ లు ఉన్నాయి. వాళ్ళు ఇలాగే దాడులు చేస్తే.. అడ్డుకునే క్షిపణి వ్యవస్థలు నిండుకునే అవకాశం ఉంటుంది. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, షాహెద్ డ్రోన్ తయారీకి ఇరాన్ రూపాయి ఖర్చు చేస్తే.. 20 నుంచి 28 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇలాంటి యుద్ధం కోసమే ఇరాన్ వాటిని తయారు చేసిందని లండన్‌కు చెందిన సెంటర్ ఫర్ ఇన్ఫర్మేషన్ రెసిలెన్స్‌లో పరిశోధకురాలు కైల్ గ్లెన్ పేర్కొన్నారు. ఈ డ్రోన్ సామర్ధ్యాన్ని ముందే గుర్తించిన రష్యా.. 2022 నవంబర్ లో, వాషింగ్టన్‌ కు చెందిన ప్రపంచ భద్రతా సంస్థ C4ADS నివేదిక ప్రకారం, ఇరాన్ నుండి 1.75 బిలియన్ డాలర్ల విలువైన డ్రోన్ లు కొనుగోలు చేసింది. 20 వేల డాలర్ల డ్రోన్ లు ఇరాన్ ప్రయోగిస్తే.. వాటిని అడ్డుకోవడానికి అమెరికాకు 4 మిలియన్ డాలర్ల ఖర్చు అయింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్