Sunday, March 1, 2026 06:09 PM
Sunday, March 1, 2026 06:09 PM

టార్గెట్ బీఆర్ నాయుడు.. డీప్ ఫేక్ తో వైసీపీ దారుణం

తిరుమల విషయంలో మరో వివాదం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారనేది టీడీపీ నేతలు తొలి నుంచి చేస్తున్న ఆరోపణ. మరోవైపు తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారనే అంశం పెద్ద ఎత్తున దుమారం రేపడంతో.. ఆ విషయం దారి మళ్లించడానికి వైసీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు కూడా. గతంలో స్వామి వారి విగ్రహాన్ని రోడ్డు పక్కన పడేశారని ఓ సారి, తిరుమలలో మద్యం అంటూ మరోసారి, టోకెన్ల జారీలో నిర్లక్ష్యం, తొక్కిసలాట అంటూ, వీఐపీ సేవలో తరిస్తూ సామాన్య భక్తులకు గాలికి వదిలేశారంటూ పదే పదే ఆరోపిస్తున్నారు. అయితే తాజాగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు రాసలీలలు అంటూ వీడియో వైరల్ చేస్తున్నారు వైసీపీ నేతలు.

Also Read : ఖమేనీ అంతం.. మిడిల్ ఈస్ట్‌లో మంటలు.. ఇరాన్ ప్రతీకారం హెచ్చరిక

టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు రాసలీలలు వెలుగులోకి!.. అంటూ వైసీపీ తన అధికారిక సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది. పవిత్రమైన టీటీడీ ఛైర్మన్ పదవిలో ఉండి ఈ పనులేంటి బీఆర్ నాయుడు?.. అంటూ ప్రశ్నించింది. నీలాంటి నీచులకు ఆ పదవిలో ఉండే అర్హత లేదు.. వెంటనే రాజీనామా చెయ్.. అంటూ బీఆర్ నాయుడుని ట్యాగ్ చేస్తూ వైసీపీ అధికారిక సోషల్ మీడియాలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరో అడుగు ముందుకు వేసిన వైసీపీ నేతలు.. “కనక సింహాసనమున శునకము కూర్చుండబెట్టిన అది పూర్వపు గుణము మానదు కదా! టీవీ 5లో ‘Midnight Masala’ లాంటి నీచమైన ప్రోగ్రామ్‌లు నడిపిన బీఆర్ నాయుడుకి.. టీటీడీ ఛైర్మన్ బాధ్యతలు అప్పగించావు.. కానీ రోజుల వ్యవధిలోనే తన సహజ బుద్ధి చూపించాడు. ఈరోజు అడ్డంగా దొరికిపోయి తిరుమల పవిత్రతను, భక్తుల మనోభావాలను బజారున పడేశాడు. ఇలాంటి నీచమైన వ్యక్తిని ఆ పవిత్ర పదవిలో కూర్చోబెట్టినందుకు భక్తులకు ఏం సమాధానం చెబుతారు..?” అంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ పేర్లను ట్యాగ్ చేస్తూ పోస్టే చేసింది.

Also Read : యుద్ధం మొదలైంది.. ఇరాన్ రియాక్షన్ స్టార్ట్..!

టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అనైతిక చర్యలకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పాల్పడ్డారని.. ఆయనను వెంటనే పదవి నుంచి తప్పించాలని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వి ఫోన్ కాల్ బయటకు వచ్చిన వెంటనే ఆయనను పదవి నుంచి తొలగించామని.. స్వామి వారి సేవ చేయాల్సిన చోట బీఆర్ నాయుడు వాత్యాయనుడికి వారసుడిగా మారారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియోలు నిజమైనవే అని.. డీప్ ఫేక్ అని, ఆ వీడియోలు ఏఐ అని బీఆర్ నాయుడు చెప్తున్న మాట అబద్ధమన్నారు. ఏఐ నిపుణులు కూడా ఆ వీడియోలు కరెక్టే అని చెప్పారు. రాజీనామా చేయకపోగా.. తన వర్గపు మీడియా ద్వారా ఎదురుదాడి చేయటం సిగ్గుచేటు అంటూ భూమన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Also Read : కనిమొళికి, కవితకు జరిగిన న్యాయం.. అయేషా మీరాకు జరగలేదేం..?

నకిలీ డీప్ ఫేక్ వీడియోలతో కొందరు సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని.. వ్యక్తిగతంగా తనను అప్రతిష్ట పాలు చేసేందుకు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్రలు చేస్తున్నారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విమర్శించారు. ఏఐ సాంకేతికతను వాడుకుని తన రూపం అనుకరించే విధంగా వీడియోలు తయారు చేసి ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ కంటెంట్ మొత్తం అసత్యమైనదని, వక్రీకరించినది.. ఇది టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు పన్నిన పథకం అన్నారు. దీని వెనుక రాజకీయ దురుద్దేశం ఉందన్నారు. వైసీపీకి చెందిన కొందరు ఈ తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని.. దీనిపై చట్ట ప్రకారం ముందుకెళ్తా అన్నారు. తనపై సోషల్ మీడియాలో సాగుతున్న దుష్ప్రచారం వెనుక ఉన్న కుట్రను తేల్చాలని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ టీటీడీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వ్యక్తులను, దుష్ట శక్తులను వదిలేది లేదన్నారు. అయితే ఆ వీడియోలో ఉన్న మహిళ కుటుంబానికి తమ కుటుంబానికి మధ్య 30 ఏళ్ల అనుబంధం ఉందని.. వాళ్లు తమ ఇంటికి, వాళ్ల ఇంటికి తాము వెళ్లడం సహజమే అని.. ఆ వీడియోల అసభ్యకరంగా ఎక్కడా లేదన్నారు. దీంతో ఇప్పుడు ఈ వ్యవహరం పెద్ద దుమారం రేపుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఖమేనీ అంతం.. మిడిల్...

పశ్చిమ ఆసియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు...

బ్రేకింగ్ : కాకినాడలో...

ఆంధ్రప్రదేశ్ లో మరో ఘోర ప్రమాదం...

కనిమొళికి, కవితకు జరిగిన...

ఆయేషా మీరా హత్య కేసు.. తెలుగు...

ఢిల్లీలో స్వామిని యాక్టివేట్...

ప్రాంతీయ పార్టీలు వారి వారి రాష్ట్రాల్లో...

ఇంత జరుగుతున్నా.. ఆయనెక్కడా..?

ఇంత జరుగుతున్నా.. ఆయనెక్కడా..? ఇప్పుడు ఇదే...

బీఆర్ఎస్, బిజెపిలకు బులెట్...

గత నాలుగేళ్ల నుంచి సంచలనంగా మారిన...

పోల్స్