Sunday, May 3, 2026 12:45 AM
Sunday, May 3, 2026 12:45 AM

పయ్యావుల వర్సెస్ మండలి చైర్మన్..!

ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో రాజకీయం హాట్ హాట్ గా నడుస్తోంది. బడ్జెట్ సమావేశాలు కాస్తా కల్తీ లడ్డు సమావేశాలుగా మారిపోయాయి అనే విమర్శలు కూడా వస్తున్నాయి. అధికార పార్టీ నేతలను టార్గెట్ గా చేసుకుని వైసీపీ విమర్శలు చేయడం, దీనిపై టీడీపీ అదే స్థాయిలో కౌంటర్ ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. ఇక ఇదే అంశంలో వైసీపీ ఎమ్మెల్సీలు నిన్న బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజును కూడా టార్గెట్ చేయడం జరిగాయి. ఇక ఈ పరిణామాల నేపధ్యంలో ఆర్ధిక మంత్రి పయ్యావుల వర్సెస్ చైర్మన్ మోషేన్ రాజుగా వ్యవహారం మారింది.

Also Read : బ్రేకింగ్: లిక్కర్ కేసులో కవిత సేఫ్..!

అధికార సభ్యుల తీరుపై శాసన మండలి ఛైర్మన్ ముందు ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రశ్నోత్తరాలు మళ్లీ మొదలు పెట్టాలనడం సరికాదని.. నాపై మంత్రి పయ్యావుల వ్యాఖ్యలు అవాస్తవం అంటూ ఆయన అసహనం వ్యక్తం చేసారు. నేను సంతకం చేశానని చెప్పిన మాటలు సరికాదని, అధికార, ప్రతిపక్షాలు సభ సజావుగా జరిగేలా సహకరించాలని కోరగా.. ఈ వ్యాఖ్యలను టీడీపీ ఎమ్మెల్సీలు పయ్యావుల దృష్టికి తీసుకువెళ్ళారు. మండలి చైర్మన్ స్టేట్‌మెంట్ ను తెప్పించుకుని మంత్రి పయ్యావుల కేశవ్ పరిశీలించారు.

Also Read : నా భర్తను పరిచయం చేస్తున్నా: రష్మిక

సభ గౌరవాన్ని కాపాడేందుకు తాను వచ్చిన తర్వాత అన్ని విషయాలపై మాట్లాడతానని ఎమ్మెల్సీలకు పయ్యావుల తెలిపారు. తాను చూపించిన స్టేట్‌మెంట్ నిజం కాదని చైర్మన్ ఎలా చెబుతారని ప్రశ్నించిన పయ్యావుల.. కేంద్ర నిర్ణయాలు కేబినెట్ సెక్రటరీ పేరుతో, రాష్ట్ర ప్రభుత్వ సమాచారం చీఫ్ సెక్రటరీ పేరు, అసెంబ్లీ సమాచారం సెక్రటరీ జనరల్ పేరుతో జారీ చేస్తారని పయ్యావుల గుర్తు చేసారు. మండలి ఆఫీస్ నుంచి వెళ్లిన లేఖ అంటే మండలి చైర్మన్ నిర్ణయంగానే పరిగణించకుండా ఎలా ఉంటామని మంత్రి పయ్యావుల కేశవ్ నిలదీశారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

సీఐని సస్పెండ్ అయ్యే...

పల్నాడు జిల్లా వినుకొండలో ఒక పోలీస్...

రష్మీని టార్గెట్ చేసిన...

యాంకర్ రష్మీ గౌతమ్‌ను వైసీపీ నేతలు...

పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం...

ఆంధ్రప్రదేశ్ జీవనాడి, బహుళార్థసాధక ప్రాజెక్టు అయిన...

టీడీపీ ఎమ్మెల్యే సంచలన...

ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో...

బ్రేకింగ్ : కల్తీ...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో...

బ్రేకింగ్: డిప్యూటి సీఎం...

ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు హైదరాబాద్‌లో...

పోల్స్