Friday, May 1, 2026 07:52 AM
Friday, May 1, 2026 07:52 AM

ఇండియన్స్ కు ట్రంప్ బిగ్ షాక్..?

తమ దేశ ఆదాయాన్ని పెంచేందుకు, ఆర్ధిక మాంద్యం నుంచి బయటపడేసేందుకు.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన అడుగులు వేస్తోన్న సంగతి తెలిసిందే. టారిఫ్ ల పేరుతో ప్రపంచ దేశాలపై ఆయన పదే పదే టారిఫ్ లు విధిస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల అమెరికా సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పుతో ట్రంప్ షాక్ అయ్యారు. ఆ తర్వాతి నుంచి.. ఆ లోటును భర్తీ చేసేందుకు రెండు దఫాలుగా 15 శాతం టారిఫ్ లు విధించారు ట్రంప్. ఇక తాజాగా మరోసారి ఆయన కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు.

Also Read : ఆపరేషన్ సిందూర్ టార్గెట్ పాక్ ప్రధాని.. ట్రంప్ సంచలనం..!

హెచ్ 1 బీ వీసాల ద్వారా ఆర్జించే ఆదాయం, బిజినెస్ వీసాల ద్వారా చేసే వ్యాపారాలకు సంబంధించిన వివిధ రకాల పన్నులు, విదేశీ విద్యార్ధుల ఫీజులు, వీసా ఫీజులు, మెడికల్ వీసా ఫీజులు, టూరిస్ట్ వీసా ఫీజులను భారీగా పెంచే ఆలోచనలో ట్రంప్ ఉన్నారు. హెచ్ 1 బీ వీసాల ద్వారా ఉద్యోగాలు చేసే వారికి పన్నులు పెంచే ఆలోచనలో ట్రంప్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే పలు కీలక కోర్సులకు ఫీజులు పెంచేందుకు కూడా ట్రంప్ రెడీ అయినట్లు సమాచారం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇది అమలు కానుంది.

Also Read : భారత జట్టులో సంచలన మార్పులు..!

అయితే అమెరికా పౌరుల పన్నులకు సంబంధించి మాత్రం ట్రంప్ పెద్దగా ఫోకస్ చేయడం లేదు. టారిఫ్ ల ద్వారా ఇప్పటి వరకు ట్రంప్ వచ్చిన తర్వాత 200 బిలియన్ డాలర్లను అమెరికా ఆర్జించిన సంగతి తెలిసిందే. ఇక విదేశాల నుంచి వచ్చే వారికి మెడికల్ ఖర్చులు కూడా అమెరికాలో పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కాగా ఇటీవల వాణిజ్య లోటును జాతీయ అత్యవసర పరిస్థితిగా ప్రకటించడానికి ఆయన 1977 చట్టాన్ని అమలు చేశారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అబార్షన్ చట్టంపై సుప్రీంకోర్టు...

14 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్...

ఏపీ బ్రాండ్‌కి సచిన్‌...

నారా లోకేశ్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు చూడటానికి...

తల్లికి వందనం అప్పుడే.....

2026-27 విద్యా సంవత్సరం నేపథ్యంలో కూటమి...

మరో పార్టీ నేతను...

రాజకీయాల్లో ఇప్పుడు విపరీత ధోరణి కనిపిస్తోంది....

టెన్త్ ఫలితాల్లో లోకేష్...

ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్...

చేసిన పాపం.. కార్యకర్తల...

వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా మాజీ ఇన్ఛార్జ్...

పోల్స్