Monday, August 3, 2026 01:13 PM
Monday, August 3, 2026 01:13 PM

భారత జట్టులో సంచలన మార్పులు..!

టి20 వరల్డ్ కప్ లో అసలైన పోటీ ఏంటో భారత్ చూస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ 8 లో ఇప్పుడు భారత్ ఖచ్చితంగా రెండు మ్యాచ్ లు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మ్యాచ్ లలో ఒక్కటి ఓడిపోయినా భారత్ కు అవకాశాలు క్లిష్టంగా మారే అవకాశం ఉంటుంది. ఇక నేడు జింబాబ్వే తో జరిగే మ్యాచ్ లో భారత్ భారీ తేడాతో గెలిస్తేనే సెమీస్ కు అవకాశాలు సజీవంగా ఉంటాయి. సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ జట్లు రన్ రేట్ పరంగా మంచి పొజిషన్ లో ఉన్నాయి. ఇప్పుడు భారత్ కూడా అలాంటి విజయం సాధించాలి.

Also Read : ఆయన బెయిల్ రద్దు చేయండి.. మరి అన్నది..?

ఈ నేపధ్యంలో నేడు జరగబోయే మ్యాచ్ లో భారత్ ఏయే మార్పులు చేస్తుంది అనే దానిపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇషాన్ కిషన్ ఫాం విషయంలో ఆందోళన కనపడటం లేదు. కానీ.. అభిషేక్ శర్మ విషయంలో కంగారు ఎక్కువగా ఉంది. దీనితో అతని స్థానంలో ఖచ్చితంగా మార్పు జరిగే అవకాశం ఉంది. సంజు సామ్సన్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉండవచ్చు. అదే సమయంలో.. వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్ పటేల్ ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Also Read : జగన్ ను తిట్టోద్దని పవన్ చెప్పారా..?

అలాగే రింకు సింగ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. తిలక్ వర్మను తప్పించి.. ఆ స్థానంలో వాషింగ్టన్ సుందర్ కు అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే బ్యాటింగ్ ఆర్డర్ లో కూడా మార్పులు జరగాలి. సూర్య కుమార్ యాదవ్ 3 వ స్థానంలో బ్యాటింగ్ చేస్తే మంచిదని సూచిస్తున్నారు. 4వ స్థానంలో సుందర్ ను ఆడించి.. అక్షర్ పటేల్ ను జట్టులోకి తెస్తే మాత్రం మంచి రిజల్ట్ ఉండే ఛాన్స్ ఉంది. ఏది ఏం జరిగినా భారత్ భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఉరవకొండలో పొలిటికల్ హీట్.....

ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాజకీయ వాతావరణం...

ఉత్తరాంధ్ర కాదు.. ఇక...

విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి...

ఇదీ ఉత్తరాంధ్ర దెబ్బ.....

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ...

మోడీని దారుణంగా మాట్లాడారు.....

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ...

భోగాపురంలో చరిత్ర సృష్టించిన...

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారమవుతూ,...

అంతర్జాతీయ అద్భుతం.. మన...

విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా...

పోల్స్