Monday, August 3, 2026 01:31 PM
Monday, August 3, 2026 01:31 PM

బ్రేకింగ్: గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి లోకేష్..!

రెండు రోజుల విరామం తర్వాత ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. కల్తీ నెయ్యి వ్యవహారం మరోసారి ఏపీ శాసన మండలిని కుదిపేసింది. రాజకీయంగా గత పది రోజుల నుంచి అసెంబ్లీ సమావేశాల్లో ఈ వ్యవహారం అత్యంత కీలకంగా మారిన పరిస్థితి చూస్తున్నాం. ఇక తాజాగా ఏపీ అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేసారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో మంత్రి నారా లోకేష్ మాటామంతి నిర్వహించారు. లడ్డూ కల్తీకి సంబంధించిన వాస్తవాలను, దేవదేవుడికి జరిగిన మహాపచారం అసెంబ్లీ వేదికగానే బయటపెడతామని స్పష్టం చేసారు.

Also Read : చెవిరెడ్డిని ఊహించని దెబ్బ కొట్టిన జగన్..!

అసెంబ్లీకి రావాలని ఎవరూ బొట్టుపెట్టి పిలవరు.. సభకు రావడం సభ్యులుగా వారి బాధ్యత అని స్పష్టం చేసారు. దేవుడిని కూడా వైసీపీ రోడ్డు మీదకు తీసుకురావడం బాధాకరం అని ఆగ్రహం వ్యక్తం చేసారు. దేవుడి ఫోటోలతో చట్టసభల్లో ర్యాలీలు ఆక్షేపణీయం అని మండిపడ్డారు. ఇక జాబ్ క్యాలెండర్ గురించి లోకేష్ కీలక ప్రకటన చేసారు. ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం అని లోకేష్ స్పష్టం చేసారు. జాబ్ క్యాలెండర్‌లోనే డీఎస్సీ పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి ప్రకటించారు.

Also Read : చెప్తే అర్ధం కాదా..? ఎమ్మెలపై పవన్ సీరియస్..!

ఇతర రాష్ట్రాల్లో కేజీబీవీ అడ్మిషన్లు జరగడం లేదు.. కానీ మన దగ్గర అడ్మిషన్లకు పోటీ ఉంది అని అన్నారు. ఉన్నత విద్యలో ఇంజనీరింగ్ సహా పాలిటెక్నిక్, ఐటీఐ కూడా కీలకం అని పేర్కొన్నారు. క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ ఆధారంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు అనుబంధంగా వచ్చే ఏడాదిలోగా పనులు చేస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. వైసీపీ వాయిదా తీర్మానాన్ని మండలి ఛైర్మన్ తిరస్కరించారు. దీనితో.. ఛైర్మన్ పోడియాన్ని ముట్టడించారు వైసీపీ సభ్యులు. వైసీపీ సభ్యుల ఆందోళనల మధ్య శాసనమండలి వాయిదా పడింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఉరవకొండలో పొలిటికల్ హీట్.....

ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాజకీయ వాతావరణం...

ఉత్తరాంధ్ర కాదు.. ఇక...

విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి...

ఇదీ ఉత్తరాంధ్ర దెబ్బ.....

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ...

మోడీని దారుణంగా మాట్లాడారు.....

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ...

భోగాపురంలో చరిత్ర సృష్టించిన...

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారమవుతూ,...

అంతర్జాతీయ అద్భుతం.. మన...

విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా...

పోల్స్