Wednesday, April 8, 2026 10:46 PM
Wednesday, April 8, 2026 10:46 PM

ఆయేషా మీరా కేసు క్లోజ్..!

ఆయేషా మీరా హత్య కేసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కాదు.. దేశవ్యాప్తంగా సంచలమైన కేసుల్లో ఒకటిగా నిలిచింది. 2007 డిసెంబర్ 27న విజయవాడ సమీపంలోని, ఇబ్రహీంపట్నంలో ఉన్న ఒక లేడీస్ హాస్టల్ లో జరిగిన సంచలన ఘటన ఇది. బీఫార్మసీ విద్యార్థినిగా హాస్టల్లో ఉండి చదువుకుంటున్న ఆమెపై, అత్యాచారం చేసి హత్య చేశారు అప్పట్లో. గుంటూరు జిల్లా తెనాలి కి చెందిన ఆయేషా మీరా.. ఇబ్రహీంపట్నంలో నిమ్రా కాలేజీలో బీఫార్మసీ చదువుతోంది. అప్పట్లో ఈ కేసులో స్థానిక పోలీసులు నందిగామ సమీపంలోని, అనాసాగరం గ్రామానికి చెందిన సత్యంబాబును అరెస్టు చేశారు.

Also read : ఆఫ్ ది రికార్డు వార్తలు.. పార్ట్ 2..!

2018లో అతడిని హైకోర్టు నిర్దోషిగా గుర్తించింది. ఆ తర్వాత కేసును సిబిఐకి అప్పగించింది హైకోర్టు. 2019 నుంచి దర్యాప్తు చేసిన సిబిఐ.. రి పోస్టుమార్టం కూడా చేసింది. మునుపటి అధికారులు విచారణలు చేసినా సరే.. కొత్త ఆధారాలు మాత్రం దొరకలేదు. హాస్టల్ స్నేహితులు విదేశాల్లో ఉండటం.. పాత రికార్డులు ధ్వంసం కావడంతో.. కేసు ముందుకు వెళ్లలేదు. ఇక తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విజయవాడ సిబిఐ కోర్టు న్యాయమూర్తి అన్నపూర్ణ.. ఆధారాలు లేకపోవడంతో కేసును మూసివేశారు.

Also read : బరువు తగ్గే వాళ్ళు ప్రోటీన్ ఎప్పుడు తీసుకోవాలి..?

అప్పటినుంచి తల్లిదండ్రులు ఎంత పోరాటం చేసినా ఇప్పటి వరకు కూడా.. ఈ కేసులో న్యాయం అనేది బయటకు రాలేదు. అప్పట్లో మాజీ ఉపముఖ్యమంత్రి మనవడు.. ఈ కేసులో కీలక నిందితుడిగా భావించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే కేసును నీరు గార్చారు అనే విమర్శలు తీవ్ర స్థాయిలో వచ్చాయి. చివరకు కేసులో నిందితులు ఎవరో తెలియకుండానే విచారణ ముగిసిపోయింది. సత్యంబాబు నిర్దోషి అని అయేషా మీరా తల్లిదండ్రులు ఎన్నో సందర్భాల్లో వాదిస్తూ వచ్చారు. తాము అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని అప్పట్లో తెలుగుదేశం పార్టీ నేతలు కూడా హామీలు ఇచ్చారు. కానీ ఇప్పటివరకు అసలు దోషులు ఎవరో ప్రపంచానికి.. తెలిసిన శిక్ష మాత్రం పడలేదు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రోజాకు బిగుస్తున్న ఉచ్చు.....

వైసీపీ హయాంలో ఎంతో ఆర్భాటంగా నిర్వహించిన...

భోగాపురం ముహుర్తం ఫిక్స్..!

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భోగాపురం...

బ్రేకింగ్ : రెడ్డప్పగారి...

పార్టీ కేడర్‌ను పట్టించుకోని నేతలపై టీడీపీ...

దేవాదాయ శాఖలో ఏసీబీ...

గత రెండేళ్ళ నుంచి ఏపీలో హాట్...

కేసీఆర్ బయటకు వస్తారా.....

భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు, మాజీ...

తమిళనాడులో అలా.. మరి...

చట్టం అందరికీ సమానమే. బాధితులకు న్యాయం...

పోల్స్