Saturday, May 23, 2026 07:12 PM
Saturday, May 23, 2026 07:12 PM

మిహీక నా ఫ్రెండ్ కాదు.. రానా ఇంట్రస్టింగ్ కామెంట్స్..!

సినిమాల కంటే ఇతర వ్యవహారాలతో స్టార్ యాక్టర్ రానా దగ్గుబాటి ఫేమస్ అవుతూ ఉంటాడు. ఇక తన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచడానికి ఇష్టపడే రానా.. ప్రస్తుతం చిన్న చిన్న సినిమాలను ప్రోత్సహించే పనిలో ఉన్నాడు. అదొక్కటే కాకుండా అనేక కార్యక్రమాలు చేసే ఈ స్టార్ కిడ్.. తాజాగా  రియా చక్రవర్తితో ఆమె పాడ్‌కాస్ట్, చాప్టర్ 2 విత్ రియా చక్రవర్తిలో జరిగిన చిట్ చాట్‌ లో, కరోనా మహమ్మారి తన జీవితాన్ని ఎలా మార్చిందో.. మిహీకా బజాజ్‌తో పరిచయం మరియు వివాహానికి దారి తీసిన కారణాలను రానా బయటపెట్టాడు.

Also Edit : మోహన్ బాబు అరెస్ట్ తప్పదా..?

చిట్ చాట్ లో భాగంగా.. రియా, రానాతో మాట్లాడుతూ గతంలో ఫోన్ చేసి మరుసటి రోజు పెళ్లి చేసుకుంటున్నానని చెప్పిన విషయం గుర్తు చేసింది. అంత అకస్మాత్తుగా ఎందుకు అలా మారిపోయావని రానాను రియా అడిగింది. దీనికి స్పందించిన రానా.. కరోనా తనను నిజంగా అలాగే మార్చేసింది అన్నాడు. 2020 లో, తాను అమెరికా నుండి తిరిగి వచ్చానని, ఆ తర్వాత కరోనాలో పెళ్లి చేసేసుకోవాలి అనుకున్నాను అని.. కరోనా టైంలో ఒంటరిగా ఫీల్ అయ్యాను అని చెప్పుకొచ్చాడు.

Also Edit : మరోసారి అడ్డంగా దొరికిపోయిన వైసీపీ..!

గతంలో గుండె సమస్యలు, మూత్రపిండాల వైఫల్యం వంటి తీవ్ర సమస్యలతో రానా తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. చికిత్స కోసం అమెరికా వెళ్ళాడు. ఆ టైం లో ఒంటరిగా ఫీల్ అయినట్లు చెప్పుకొచ్చాడు. ఆ సమయంలోనే తాను మిహీకాతో మాట్లాడటం మొదలుపెట్టానని చెప్పుకొచ్చాడు. అప్పుడే తనకు అర్ధమైందని, మిహీక తనతో జీవించగల వ్యక్తి అని.. ఆమెతో మొదటిసారి మాట్లాడుతున్నప్పుడు, తనకు అలాగే అనిపించిందని తెలిపాడు. తాము ఒకరికి ఒకరం అంతవరకు కేవలం పరిచయం మాత్రమే ఉంది అని, స్నేహితులు కాదన్నాడు. కరోనా టైం లో కనెక్ట్ అయ్యామని, అప్పుడే పెళ్లి చేసుకుందాం అని డిసైడ్ అయి పెళ్లి చేసేసుకున్నామన్నాడు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బెజవాడ కాదు… ఇది...

రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయి.. మృగశిర...

బెజవాడ థార్ గొడవ...

విజయవాడ నడిరోడ్డుపై జరిగిన థార్ కార్ల...

బ్రేకింగ్: ఇద్దరు ఎమ్మెల్యేలకు...

జనసేన పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల...

ట్రంప్ పిచ్చి తట్టుకోలేకే...

అమెరికా రాజకీయాల్లో అత్యంత కీలక పరిణామం...

చంద్రబాబుతో ఏపీ బిజేపి...

ఏపీలో రాజకీయ పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి....

ఇన్స్టంట్ ఫ్రెండ్ వర్సెస్...

ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదం ఏపీలో...

పోల్స్