Wednesday, May 20, 2026 05:40 PM
Wednesday, May 20, 2026 05:40 PM

విజయవాడకు మెగా ప్రాజెక్టులు..!

కూటమి సర్కార్ ‌అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోకస్ అంతా విశాఖపట్నం పైనే ఉంచిందని.. విజయవాడ అభివృద్ధిని ఏ మాత్రం పట్టించుకోవటం లేదనే ఆరోపణలకు ప్రభుత్వం చెక్ పెడుతోంది. రాష్ట్రానికి సరిగ్గా సెంటర్‌ పాయింట్‌లా ఉన్న విజయవాడను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రధానంగా దక్షిణ భారతదేశ ఆర్థిక రాజధానిగా గుర్తింపు తెచ్చుకున్న విజయవాడకు వచ్చే అన్ని మార్గాలను మరింత విస్తరించేందుకు అధికారులు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. ఇందులో భాగంగా రైల్వే, రోడ్ కనెక్టివిటీ మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వ సాయంతో చర్యలు ప్రారంభించింది.

Also Read : ఆత్మీయ క‌ల‌యిక‌.. ఇల్లే వేదిక‌.. లోకేష్ స‌రికొత్త సంప్ర‌దాయం

చెన్నై – ఢిల్లీ మార్గంలో అత్యంత రద్దీగా ఉన్న బల్హార్ష – గూడూరు రైల్వే మార్గంలో 4న లైన్ నిర్మించేందుకు కేంద్రం అంగీకరించింది. మొత్తం 745 కిలోమీటర్ల ఈ మార్గం వల్ల విజయవాడ – వరంగల్, విజయవాడ – చెన్నై మార్గంలో మరిన్ని రైళ్లు అందుబాటులోకి వస్తాయి. విజయవాడ – గుంటూరు మధ్యలో 3, 4 లైన్ కోసం సిద్ధం చేసిన డీపీఆర్‌ సర్వేకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. అలాగే విజయవాడ – ఏలూరు మధ్య 3, 4వ లైన్ నిర్మాణం కూడా ఆమోదించారు. అలాగే గుడివాడ – తెనాలి మధ్యలో కొత్త రైల్వే లైన్ నిర్మించనున్నారు. ఈ లైన్ విజయవాడ బైపాస్‌గా ఉంటుందంటున్నారు.

ఇక ఇప్పటికే మచిలీపట్నం పోర్టు నుంచి విజయవాడ వరకు ఉన్న నాలుగు లైన్ల రహదారిని ఆరు లైన్లుగా విస్తరిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి అధికారికంగా ప్రకటించారు. తాజాగా కనకదుర్గ ఫ్లై ఓవర్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు 5 కిలోమీటర్ల పొడవైన మెగా ఫ్లై ఓవర్ నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేశారు. అలాగే బెంజ్ సర్కిల్ నుంచి గోశాల వరకు 12 కిలోమీటర్ల పొడవైన ఫ్లై ఓవర్ నిర్మాణానికి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు సంబంధించి ఈ నెల 18వ తేదీన విజయవాడలో వాటాదారుల సమావేశం నిర్వహించనున్నారు. అలాగే విజయవాడలో రహదారుల అభివృద్ధికి సీఆర్‌డీఏ భారీ ఎత్తున నిధులు కేటాయించింది.

Also Read : బ్రేకింగ్: అరవ శ్రీధర్ అరెస్ట్..?

బల్లెంవారివీధి జంక్షన్ నుంచి నిడమానూరు జంక్షన్ వరకు రహదారి విస్తరణకు రూ.25.40 కోట్లు కేటాయించారు. అలాగే మహానాడు రోడ్డు విస్తరణకు మరో రూ.25.21 కోట్లు కేటాయించారు. బల్లెంవారి వీధి రహదారిని నాలుగు లైన్ల మార్గంగా విస్తరించేందుకు రూ.22.35 కోట్లు సీఆర్‌డీఏ కేటాయించింది. మొత్తం రూ.73 కోట్ల విలువైన పనులను సీఆర్‌డీఏ టెండర్లు ఆహ్వానించింది. 3 మార్గాల్లో రహదారి విస్తరణ, నిర్మాణం, డివైడర్ నిర్మాణం, లైటింగ్ ఏర్పాటు కూడా ఉంటుందని అధికారులు సూచించారు. మొత్తానికి విజయవాడ నగరంలో ట్రాఫిక్ కష్టాలు ప్రభుత్వం చెక్ పెట్టనుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

టీ బీజేపీలో భారీ...

తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన బండి...

కేంద్రానికి విజయ్ బిగ్...

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ...

ముందస్తు ఎన్నికలకు రెడీ...

తమిళనాడు రాజకీయాలు మరోసారి సంచలనంగా మారాయి....

ముంబై హైకోర్ట్ లాయర్...

దేశంలో మహిళల భద్రతపై ఇటీవలి కాలంలో...

నీట్‌ పరీక్షపై కేంద్రం...

నీట్ యూజీ 2026 పేపర్ లీక్‌పై...

అవును.. వాళ్లిద్దరు కలిశారు.....

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు.. అలాగని.....

పోల్స్