Saturday, August 22, 2026 12:25 PM
Saturday, August 22, 2026 12:25 PM

బ్రేకింగ్: అరవ శ్రీధర్ అరెస్ట్..?

గత నెల రోజులుగా జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం ఆ పార్టీతో పాటుగా రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఓ మహిళతో ఆయనకు ఉన్న సంబంధాలు, దానిపై మీడియాలో జరిగిన హడావుడి.. రాజకీయ పరిణామాలు అన్నీ కలిసి.. ఆయన పదవికి ఎసరు పెట్టే సంకేతాలు కనపడుతున్నాయి. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఆయనను సస్పెండ్ చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. సస్పెండ్ చేసేందుకు అధినేత పవన్ కళ్యాణ్ సిద్దమయ్యారని ప్రచారం నడుస్తోంది.

Also Read : దమ్ముంటే నిరూపించాలి.. వైసీపీ ఎమ్మెల్సీపై లోకేష్ ఫైర్..!

అసెంబ్లీ సమావేశాలు మొదలైనా సరే ఆయన మాత్రం సభకు హాజరు కాలేదు. దీనిపై కూడా అస్సెంబ్లీ వర్గాల్లో చర్చ జరిగింది. ఇక ఇప్పుడు ఆయనను పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత.. అరెస్ట్ చేసే అవకాశం కనపడుతోంది. అరవ శ్రీధర్, వీణ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ కు ఇప్పటికే ప్రాధమిక నివేదిక చేరినట్లు తెలుస్తోంది. శ్రీధర్ ని పార్టీ నుంచి బహిష్కరించాల్సిందేనని డిసైడ్ అయిన పవన్.. ఇప్పటికే ఎమ్మెల్యేకి సమాచారం కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అరవ శ్రీధర్ విషయంలో ఇప్పటికే ఆలస్యం జరిగిందని, ఇక ఉపేక్షించకూడదని పవన్ భావిస్తున్నారట.

Also Read : టాలీవుడ్‌లో కొత్త వ్యక్తులు.. పెత్తనానికి బ్రేక్..!

ఎమ్మెల్యే వ్యవహారాన్ని గవర్నర్ కి కూడా నివేదించినట్లు తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై విచారణ కమిటీ సభ్యుడు శివశంకర్ స్పందించారు. శ్రీధర్‌పై వచ్చిన లైంగిక ఆరోపణలపై అన్ని కోణాల్లో విచారణ జరుగుతోంది.. త్వరలోనే పూర్తిస్థాయి నివేదికను పవన్‌కు సమర్పిస్తామని తెలిపారు. శ్రీధర్‌తో పాటు రైల్వేకోడూరులో 50 మందిని విచారించామని.. వారంలోగా కమిటీ ముందు వివరణ ఇవ్వాలని శ్రీధర్‌కి పార్టీ సూచించిందని ఆయన పేర్కొన్నారు. కమిటీ ముందు హాజరుకావాలని పిలిచినా, బాధితురాలు వీణ రాలేదు.. సీల్డ్ కవర్‌లో వీణ పంపిన వివరాలను పరిశీలిస్తామన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

సాయి రెడ్డితో రాజీ...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు నంబర్...

ఆగస్టు 24 నుండి...

దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట...

భోగాపురం నుంచి విశాఖ...

ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి సర్కార్ చర్యలు...

కాంగ్రెస్‌ను కలవరపెడుతున్న అసమ్మతి..!

తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి....

ఈడీ సోదాలు.. వైసీపీ...

వైసీపీ నేతలు ఏ అంశం అయినా...

కొండా సురేఖ పై...

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొండా కుటుంబం...

పోల్స్