Saturday, August 22, 2026 02:01 PM
Saturday, August 22, 2026 02:01 PM

దమ్ముంటే నిరూపించాలి.. వైసీపీ ఎమ్మెల్సీపై లోకేష్ ఫైర్..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడీగా మొదలయ్యాయి. శాసన సభ కాస్త చప్పగా ఉండగా.. మండలిలో ప్రశ్నోత్తరాలు కాస్త వేడిగానే మొదలయ్యాయి. పెన్షన్ లు, పరిశ్రమలకు భూ కేటాయింపులు, విద్యాశాఖలో జరుగుతోన్న పరిణామాలు సహా పలు అంశాలపై ప్రతిపక్షాలు ప్రశ్నలు సంధించాయి. ఇక సభలో వైసీపీ అడిగిన కొన్ని ప్రశ్నల్లో తప్పుదోవ పట్టించే విధంగా ఉండటంపై మంత్రులు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. పెన్షన్ ల అంశంలో జరుగుతోన్న ప్రచారాన్ని మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, అచ్చేన్నాయుడు ఖండించారు.

Also Read : లిక్కర్ కేసుపై సుప్రీం సంచలన కామెంట్స్..!

ఇక ఇదే సమయంలో పరిశ్రమలకు భూ కేటాయింపులలో అక్రమాలు జరిగాయని వైసీపీ ఆరోపణలకు దిగింది. దీనిపై మంత్రి నారా లోకేష్ రియాక్ట్ అయ్యారు. పరిశ్రమలకు 99 పైసలకే భూకేటాయింపులపై ప్రశ్నోత్తరాల సమయంలో ఏపీ శాసనమండలిలో వాడీవేడి చర్చ జరిగింది. యువతకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో మేం పనిచేస్తున్నాం అంటూ లోకేష్ స్పష్టం చేసారు. ఏపీకి పరిశ్రమలు రాకూడదనే లక్ష్యంతో వైసీపీ ఉందని దుయ్యబట్టారు. విశ్వసనీయత ఉన్న కంపెనీలకే రూ.99 పైసలకు భూములు కేటాయించామని తెలిపారు.

Also Read : సెలవు పై ఐఏఎస్ కాటమనేని..!

ఐదు కంపెనీల ద్వారా 65 వేలమందికి ఉద్యోగాలను కల్పించామన్నారు. భూముల కేటాయింపుల్లో మేం ఎక్కడా లాలూచీ పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసారు. ఒక కప్పు కాఫీ కంటే నేను వారి వద్ద ఎక్కువ తీసుకుని ఉంటే నిరూపించాలని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కి లోకేష్ సవాల్ చేసారు. ఆరవ కంపెనీకి తాము భూములు కేటాయించామని నిరూపించాలని లేదంటే చేసిన ఆరోపణలు వెనక్కు తీసుకోవాలని లోకేష్ సవాల్ చేసారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

సబ్ రిజిస్ట్రార్‌కు టీడీపీ...

అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే...

సాయి రెడ్డితో రాజీ...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు నంబర్...

ఆగస్టు 24 నుండి...

దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట...

భోగాపురం నుంచి విశాఖ...

ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి సర్కార్ చర్యలు...

కాంగ్రెస్‌ను కలవరపెడుతున్న అసమ్మతి..!

తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి....

ఈడీ సోదాలు.. వైసీపీ...

వైసీపీ నేతలు ఏ అంశం అయినా...

పోల్స్