Thursday, October 8, 2026 11:32 AM
Thursday, October 8, 2026 11:32 AM

స్పీకర్ సంచలన నిర్ణయం..? వైసీపీ గొంతులో వెలక్కాయ..?

ప్రజా సమస్యల పరిష్కారానికి చట్ట సభలు తొలి ప్రాధాన్యం. గ్రామ సభల నుంచి పార్లమెంట్ వరకు సమస్యలు పరిష్కరించేందుకు సభ్యుల హాజరు అనేది తప్పనిసరి. కానీ ఈ విషయంలో వైసీపీ చేస్తోన్న వింత వాదన ఇప్పుడు తలనొప్పిగా మారింది. మళ్ళీ సిఎం అయ్యే వరకు సభకు రాను అంటూ మాజీ సిఎం వైఎస్ జగన్ వాదించడం, ఇతర సభ్యులను సభకు రానీయకుండా ఆపడం చూసాం. అయితే సభకు హాజరు కాని వారి విషయంలో ఏపీ స్పీకర్ కాస్త కఠినంగానే ఉండే సంకేతాలు క్రమంగా కనపడుతున్నాయి.

ALso Read : Video : కొడితే దిమ్మతిరిగింది ఒక్కొక్కడికి

తాజాగా ఏపీ అసెంబ్లీలో కీలక మార్పులు తెచ్చారు. బడ్జెట్‌ సమావేశాల నుంచి కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత డిజిటల్‌ విధానంలో సభ్యుల హాజరు నమోదు అవుతుంది. సభాపతి అయ్యన్న పాత్రుడు చొరవతో ఈ నూతన విధానం అమలులోకి వస్తుంది. సభ్యులు హాజరు పట్టికలో సంతకం చేసే అవసరం ఉండదు. సభ్యులు సభకు హాజరు కాకుండా జీతాలు తీసుకోవడంపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో శాసనసభలో ఏఐ ఆధారిత హాజరు నమోదుకు ఏడాదిగా కసరత్తు చేస్తోంది సర్కార్.

సభ్యులు సభలో తమకు కేటాయించిన కుర్చీలో కూర్చున్న తర్వాతనే, ఏఐ ఆధారిత డిజిటల్‌ విధానంలో సభ్యుడి హాజరును నమోదు అవుతుంది. గతంలో మాదిరి సభకు ఆలస్యంగా వచ్చి సమావేశాలు ముగియకముందే వెళ్ళడం కుదరదు. అలాగే సభలో సభ్యులు ఎంత టైం ఉన్నారో కూడా రికార్డ్ అవుతుంది. ఈ నూతన విధానంలో లేటెస్ట్ టెక్నాలజీ వాడనుంది సర్కార్. అత్యాధునిక ఫేస్‌ రికగ్ననైజేషన్‌ టెక్నాలజీని వినియోగించడం కారణంగా సభ్యుడు ఇతరుల సీట్ లో కూర్చుంటే.. అది కూడా అప్రమత్తం చేస్తుంది.

ALso Read : పదవుల ఆరాటమే.. విమర్శలు ఎక్కడ..? కూటమితో ఏపీ బిజేపి మైండ్ గేమ్..?

ప్రతి సభ్యుడి ఫొటోలను వెక్టరైజేషన్‌ ద్వారా అసెంబ్లీ వర్గాలు సేకరించాయి. వెక్టరైజేషన్‌ అంటే ఆయా సభ్యుల రూపురేఖలను గుర్తించడానికి అవసరమైన కొలతలు తీసుకోవడం. ఒక్కో ఫొటోను 175 వెక్టర్‌ పాయింట్స్‌గా తీసుకుని సాఫ్ట్‌వేర్‌ లో ఎంటర్ చేస్తారు. ఈ ప్రాసెస్ ఇప్పటికే కంప్లీట్ కాగా అసెంబ్లీలో పీటీజెడ్‌(పాన్‌.. టిల్ట్‌.. జూమ్‌) కెమెరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మానవ ప్రమేయం లేకుండా డ్యాష్‌ బోర్డుకు సమాచారం చేరుతుంది. చేరిపోతుంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

రాజకీయాల్లోకి యంగ్ హీరో...

తమిళనాట సినీ గ్లామర్‌కు, రాజకీయాలకు ఎప్పుడూ...

ప్లాస్టిక్ కరెన్సీ రెడీ.....

రూ.2 వేల నోట్లు ఇప్పుడు ఎక్కడా...

పిఠాపురంలో ఏం జరుగుతోంది..?...

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత...

విజయనగరంలో వైసీపీ మెయిన్...

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలకంగా మారిన విజయనగరం...

ఇస్లాంపై డోనాల్డ్ ట్రంప్...

ఫ్రాన్స్‌లో విద్యా వసతులు, ఉపాధ్యాయుల కొరత...

అందరి దృష్టి అక్టోబర్...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై...

పోల్స్