Wednesday, May 20, 2026 01:51 PM
Wednesday, May 20, 2026 01:51 PM

దురంధర్ హీరోకు 40 కోట్ల ఫైన్.. అసలు స్టోరీ ఏంటీ..?

దురంధర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో దుమ్మురేపిన బాలీవుడ్ స్టార్ యాక్టర్ రణవీర్ సింగ్ కు ఓ నిర్మాత షాక్ ఇచ్చాడు. ఓ సినిమా నుంచి తప్పుకుంటే భారీగా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు ఆ నిర్మాత. అసలు ఏంటీ ఆ స్టోరీ.. ఒక్కసారి చూద్దాం. 2023లో డాన్ సీరీస్ కు హీరోగా రణ్‌వీర్ సింగ్‌ ను ప్రకటించారు. షారుఖ్ ఖాన్ చేసిన డాన్ (2006) డాన్ 2 (2011) సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మూడో పార్ట్ కోసం రణవీర్ సింగ్ ను ఖరారు చేసారు నిర్మాత ఫర్హాన్ అక్తర్.

Also Read : మీకు దండం.. భారత్ తో ఆడండి.. బంగ్లాదేశ్ షాకింగ్ రిక్వెస్ట్..!

పలు సినిమాల కారణంగా రణవీర్ సింగ్ ఆ సినిమా షూట్ ఇంకా స్టార్ట్ చేయలేదు. కానీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ మాత్రం చేసింది సినిమా యూనిట్. ఈ టైం లో అనూహ్యంగా తాను తప్పుకుంటున్నా అంటూ రణవీర్ సింగ్ ప్రకటించాడు. దీనితో ఫర్హాన్ అక్తర్ నిర్మాణ సంస్థ ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ అతని నుండి భారీ పరిహారం కోరినట్లు తెలుస్తోంది. రూ.40 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేసినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. జనవరి 2026లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్న ఈ సినిమా కోసం భారీగా నిర్మాత ఖర్చు చేసాడు.

Also Read : ఇవేం గ్రేడ్ లు..? క్రికెట్ ను కామెడి షో చేస్తున్నారా..?

స్క్రిప్ట్ డెవలప్‌మెంట్, షెడ్యూలింగ్, లొకేషన్ ప్లానింగ్, ఇతర సన్నాహకాలతో ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ భారీ ఖర్చులను భరించింది. దీనితో ఆ ఖర్చులకు గల నష్టాన్ని తిరిగి తమకు చెల్లించాలని రణవీర్ సింగ్ ను డిమాండ్ చేసింది. డాన్ సీరీస్ కు బాలీవుడ్ లో మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. 80లలో అమితాబ్ చేసిన డాన్ సినిమా నుంచి ప్రేరణ పొంది ఈ సినిమా చేసారు. ఇదిలా ఉంటే, రణ్‌వీర్ ప్రస్తుతం మార్చి 19న థియేటర్లలోకి రాబోతున్న ధురంధర్ 2 పై దృష్టి పెట్టాడు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

టీ బీజేపీలో భారీ...

తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన బండి...

కేంద్రానికి విజయ్ బిగ్...

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ...

ముందస్తు ఎన్నికలకు రెడీ...

తమిళనాడు రాజకీయాలు మరోసారి సంచలనంగా మారాయి....

ముంబై హైకోర్ట్ లాయర్...

దేశంలో మహిళల భద్రతపై ఇటీవలి కాలంలో...

నీట్‌ పరీక్షపై కేంద్రం...

నీట్ యూజీ 2026 పేపర్ లీక్‌పై...

అవును.. వాళ్లిద్దరు కలిశారు.....

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు.. అలాగని.....

పోల్స్