గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.. అనే మాట ఇప్పుడు బాగా వినిపిస్తోంది. నిజానికి గుంటూరు కారం అనే పేరు ఇటీవల సినిమాల్లో తప్ప.. ఆ పేరు కూడా ఎక్కడా వినిపడటం లేదు. ఇక దాని పవర్ ప్రత్యక్షంగా చూసి చాలా కాలం అయ్యింది. ఎందుకంటే.. గుంటూరు కారం పవర్ ఇటీవల కనిపించటం లేదనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే.. మగవారిలో కారం పవర్ తగ్గినా… మహిళల్లో మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేల్లో, ఆ పార్టీ నాయకుల్లో కన్పించని గుంటూరు కారం ఘాటు పవర్.. గుంటూరు టీడీపీ మహిళల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఎవరెవరు తలదించుకోవాలి.. ఎవరెవరు తలెత్తుకోని తిరగాలో తాజాగా జరిగిన సంఘటనలను బట్టి తెలుసుకోవచ్చు. గుంటూరు కారం పవర్ చూసిన తర్వాతే ఎన్టీఆర్ జిల్లా టీడీపీ నేతల్లో కూడా చలనం వచ్చిందనే మాట బాగా వినిపిస్తోంది.
Also Read : తెలంగాణా సైనికులకు జనసేనాని బిగ్ షాక్..!
అసల విషయం ఏమిటంటే.. మిమ్మల్ని తిట్టినా భరిస్తాం.. పెద్దగా పట్టించుకోము.. కానీ మా ప్రభుత్వం పై విమర్శలు, ఆరోపణలు చేస్తే.. తగిన రీతిలో జవాబు చెబుతామంటున్నారు. తన నాయకులు చంద్రబాబు, లోకేష్ పై వ్యక్తిగతంగా, కుటుంబంపైన విమర్శలు చేసినా వారి అదేశాలపై మౌనం వహించాం..కానీ.. మా మౌనం చేతకాని తనంగా తీసుకున్నారా అనేది టీడీపీ నేతల ప్రశ్న. తాజాగా సీఎం చంద్రబాబు పైన వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా స్థాయి పార్టీ నాయకులు, నామినేటెడ్ పదవుల్లో ఉన్న వాళ్లు ముందు పెద్దగా పట్టించుకోలేదు. మనకెందుకులే అని మౌనం వహించారు. కొంతమంది మాత్రం.. అంబటి ఖబడ్దార్ అంటూ ఓ వీడియో రిలీజ్ చేసి చేతులు దులుపుకున్నారు.
అయితే టీపీ కార్యకర్తలు, అభిమానులు మాత్రం భరించకలేక పోయారు. గుంటూరు కారం పవర్ ఏమిటో చూపించారు. ఆవేశంతో తిరగపడ్డారు. వెంటపడ్డారు.. చుక్కలు చూపించారు. అయితే ఇది పధకం ప్రకారం జరిగింది మాత్రం కాదు. ఎవరో రెచ్చకొట్టింది కాదు.. అప్పటికప్పుడు టీవీల్లో, సోషల్ మీడియాలో చూసిన టీడీపీ కార్యకర్తలు ఊగిపోయారు. అంబటి ఇంటి పై దాడి చేశారు. సీఎం చంద్రబాబును బూతులు తిట్టినందుకే కడుపు మండి తిరగబడ్డారు. అంబటి దొరికితే పరిస్థితి వేరేలా ఉండేది. కానీ మహిళా ఎమ్మెల్యే గళ్లా మాధవి మాత్రం తన విధేయతను చూపారు. వచ్చిన కార్యకర్తలను సంయమనం పాటించాలని సూచించారు. అంబటిని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతే కానీ.. అంబటిపై దాడి చేయమని.. ఒక్కసారి కూడా చెప్పలేదు.
Also Read : భారత్ పై అమెరికా సంచలన ప్రకటన..!
నిజానికి ఓ మాజీ మంత్రి.. ప్రస్తుత ముఖ్యమంత్రిపై లం.. కొ.. అంటూ అనటం.. వాడమ్మ మొగుడ్ని రమ్మను.. అంటూ సవాల్ విసిరిన తర్వాత.. క్షమాపణు చెబితే సరిపోతుందా..? ఒక మాజీ మంత్రి నోటికి వచ్చినట్లు మాట్లాడటం కరెక్టేనా..? 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న అంబటి రాంబాబు ఇంత దిగజారి మాట్లాడటం సరికాదని వైసీపీ రాజకీయ మేధావులే బాహాటంగా తప్పు పడుతున్నారు. ఖండించారు కూడా. ఇదే సమయంలో అంబటి రాంబాబును నిలదీయటానికి వచ్చిన టీడీపీ మహిళా ఎమ్మెల్యేను వైసీపీ రాజకీయ విశ్లేషకులే తప్పు పట్టలేదు. ఇక మరో విశేషమేమిటంటే.. వైసీపీ కాపు నేతలు కాపు కులంపై దాడి పేరుతో రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసినా.. కాపు కులస్తులు రెచ్చిపోలేదు. ఇంకా చెప్పాలంటే.. వైసీపీ కాపు నాయకులను జగన్ రెడ్డి పాలేరులుగా వైసీపీ కార్యకర్తలుగా మాత్రమే పవన్ కళ్యాణ్ అభిమానులు పరిగణిస్తారు. డిప్యూటీ సీఎం పదవితో దేశ, విదేశాల్లో పేరు తెచ్చుకుంటున్న తమ నాయకుడిని చూసి మెజారిటీ కాపులు మురిసిపోతున్నారు కూడా.
కూటమి ప్రభుత్వంలో, కాపులకు తగిన గుర్తింపు లభించినట్లు కాపులు భావిస్తున్నారు. టీడీపీ బీసీ మహిళా ఎమ్మెల్యే ధైర్యం, చొరవను చాలా మంది అభినందిస్తున్నారు. గుంటూరు కారం పవర్ ఎలా ఉంటుందో ఆచరణలో చూపిన టీడీపీ మహిళా ఎమ్మెల్యే ఒక్క రోజులోనే సివంగిగా పేరు తెచ్చుకున్నారు. ఆమెను చూసి టీడీపీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు కూడా సిగ్గుతో తలదించుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. చంద్రబాబుపై వ్యాఖ్యలను ఖండిస్తూ.. ఆమె చూపించిన తెగింపు.. టీడీపీ మహిళలకు ముందు, ముందు ఆదర్శం అనే మాట బాగా వినిపిస్తోంది.

