Thursday, May 7, 2026 02:43 AM
Thursday, May 7, 2026 02:43 AM

భారత్ పై అమెరికా సంచలన ప్రకటన..!

భారత్ – అమెరికా దేశాల మధ్య సుంకాల యుద్ధం ఓ కొలిక్కి వచ్చిన తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సుంకాలను తగ్గించినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసిన తర్వాత వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ కీలక వ్యాఖ్యలు చేసారు. రష్యా నుంచి కొనుగోలు చేసే చమురును.. అమెరికా నుంచి కొనుగోలు చేసేందుకు నరేంద్ర మోడీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అన్నారు. మంగళవారం వైట్ హౌస్ వెలుపల విలేకరులతో మాట్లాడిన లీవిట్ ఈ వ్యాఖ్యలు చేసారు.

Also Read : ఏపీ కేబినేట్ సంచలన నిర్ణయం..!

రష్యా చమురు దిగుమతులను ఆపేందుకు అలాగే అమెరికా నుండి కొనుగోళ్లను పెంచడానికి న్యూఢిల్లీ కట్టుబడి ఉందని అన్నారు. అమెరికా ప్రస్తుతం వెనిజులా చమురు వాణిజ్యంలోని కీలక అంశాలను పర్యవేక్షిస్తున్నందున, భారత్.. వెనిజులా నుండి చమురును కొనుగోలు చేయవచ్చని, ఇది అమెరికన్ కార్మికులకు, పరిశ్రమలకు ప్రయోజనకరంగా ఉంటుందని తాను నమ్ముతున్నట్టు తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్, ప్రధాన మంత్రి మోడీ మధ్య ప్రత్యక్ష ఫోన్ సంభాషణ తర్వాత ఈ ఒప్పందం కుదిరిందని అన్నారు.

Also Read : ముంబై అండర్ వరల్డ్ లో హిందూ డాన్ ఎంట్రీ..?

ముఖ్యంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో, అమెరికా ఆర్థిక ప్రయోజనాలను బలోపేతం చేసేందుకు, రష్యా ఇంధన సరఫరాలపై భారత్.. ఆధారపడటాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా లీవిట్ ఈ ఒప్పందాన్ని తయారు చేసినట్టు ఆమె చెప్పుకొచ్చారు. ఇంధన దిగుమతులతో పాటుగా, అమెరికాలో పెద్ద ఎత్తున పెట్టుబడులకు కూడా భారత్ కట్టుబడి ఉందని లీవిట్ చెప్పుకొచ్చారు. రవాణా, ఇంధనం మరియు వ్యవసాయం వంటి రంగాలలో భారత్ దాదాపు 500 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తోందని ఆమె తెలిపారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్