Thursday, May 7, 2026 12:58 AM
Thursday, May 7, 2026 12:58 AM

ముంబై అండర్ వరల్డ్ లో హిందూ డాన్ ఎంట్రీ..?

బాంబే.. ఈ నగరం పేరు వినగానే అందరి కళ్ళ ముందు ఉండేది.. అక్కడి మాఫియా.. అండర్ వరల్డ్ కార్యాకలాపాలు. చీకటి సామ్రాజ్యంలో పేరు మోసిన డాన్ లు.. అలాంటిది ముంబై గత 15 ఏళ్ళ నుంచి అసాధ్యం అనుకున్న ప్రశాంతతను చూస్తోంది. కానీ ఇప్పుడు మళ్ళీ ముంబైలో అండర్ వరల్డ్ కార్యాకలాపాలు మొదలయ్యాయి. వాటికి ఆజ్యం పోసింది ఓ హిందూ డాన్. హాజీ మస్తాన్, దావూద్ ఇబ్రహీం, అరుణ్ గావ్లి, చోటా రాజన్ , అబూ సలేం, రవి పూజారి వంటి వాళ్ళు ముంబైలో తమ సామ్రాజ్యం విస్తరించారు.

Also Read : అంబటి, జోగి.. వైసీపీకి అద్భుతమైన అవకాశమా..?

2003లో దావూద్ ఇబ్రహీం తన కార్యకలాపాలను విరమించుకోవడం, అరుణ్ గావ్లి, చోటా రాజన్ , అబూ సలేం వంటి వారు జీవిత ఖైదు అనుభవిస్తూ జైలులో ఉండటంతో ముంబై ప్రశాంతంగా ఉంది. గ్యాంగ్‌స్టర్ల నీడలో, దోపిడీ చర్యలు, పట్టపగలు కాల్పులు, హత్యలు ఇలా ఎప్పుడూ హడావుడిగా ఉండేది ముంబై. కాని ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్ రూపంలో అండర్ వరల్డ్ కార్యాకలాపాలు విస్తరిస్తున్నాయి. సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ ఇళ్ళ వద్ద కాల్పులు.. తాజాగా చిత్రనిర్మాత రోహిత్ శెట్టి ఇంటి వెలుపల ఇటీవల జరిగిన సంఘటనలు ముంబైని భయపెడుతున్నాయి.

Also Read : ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

ప్రపంచ వ్యాప్తంగా క్రిమినల్ నెట్‌వర్క్ ఉన్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఇప్పుడు ముంబైలో యాక్టివ్ అయింది. 2002లో దావూద్ ముఠా అయిన డి-కంపెనీ ముంబైలో చివరిసారిగా కాల్పులు జరిపింది. ఆ తర్వాత 2008లో చివరిసారిగా అరుణ్ గావ్లి గ్యాంగ్ కాల్పులకు దిగింది. మూడు సంవత్సరాల తరువాత చోటా రాజన్ జర్నలిస్ట్ జె డే హత్య జరిగింది. అబూ సలేం అరెస్టు తర్వాత అతని నేర సామ్రాజ్యం కూలిపోయింది. గత 18 నెలలుగా, నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల కాల్పులు, ఎన్‌సిపి ఎమ్మెల్యే బాబా సిద్ధిఖ్ హత్య, రోహిత్ శెట్టి నివాసం వెలుపల కాల్పులతో ముంబైలో భయం మొదలైంది. జైలు నుండి తన ముఠాను నడుపుతున్న బిష్ణోయ్ సినిమా వాళ్ళను టార్గెట్ చేసాడు అనే ఆందోళన వ్యక్తమవుతోంది. మహారాష్ట్రలో అతని ముఠా ఉనికి రోజు రోజుకు పెరగడంతో మళ్ళీ డాన్ ల హవా కనపడుతుందా అనే భయం ముంబై ప్రజల్లో మొదలైంది. జైల్లో ఉండి కూడా అతను ఈ సామ్రాజ్యాన్ని ఎలా నడుపుతున్నాడో అర్ధం కాక పోలీసులు తలపట్టుకుంటున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్