Wednesday, September 23, 2026 04:16 AM
Wednesday, September 23, 2026 04:16 AM

ఏపీ కేబినేట్ సంచలన నిర్ణయం..!

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి తీవ్ర స్థాయిలో దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై రాజకీయంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది. వైసీపీని ఇబ్బంది పెట్టే క్రమంలో టిడిపి నేతలు, చేసిన కొంత అత్యుత్సాహ కార్యక్రమాలతో, అసలు విషయం పక్కదారి పట్టింది అనే విమర్శలు ఎక్కువగా వినపడుతున్నాయి. కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి, అసలు దోషులను పక్కదారి పట్టించారు అనే విమర్శలు కూడా ఉన్నాయి.

Also Read : తలోదారి అయిపోయిన టీడీపీ సోషల్ మీడియా క్యాడర్..!

రాజకీయంగా కొంతమందిని కాపాడేందుకే ప్రయత్నం చేస్తున్నారనే, విమర్శలు కూడా అధికారులపై వచ్చాయి. అయితే కల్తీ జరిగిందనే విషయం మాత్రం.. అధికారులు స్పష్టం చేసిన నేపథ్యంలో, దీనికి సంబంధించి మరింత విచారణ అవసరమనే భావనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా కనబడుతోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు కీలక వ్యక్తులను విచారించిన అధికారులు, త్వరలోనే రాజకీయ నాయకులను కూడా విచారించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

Also Read : దమ్ముంటే అసెంబ్లీకి రా.. చూసుకుందాం: గళ్ళ మాధవి ఫైర్

సిబిఐ దాఖలు చేసిన చార్జ్ షీట్ అంశానికి సంబంధించి, కొంత చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడు మరోసారి విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా ఏపీ క్యాబినెట్లో దీనికి సంబంధించి సుదీర్ఘంగా చర్చ జరిగింది. కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. చార్జిషీట్ లో లేకున్నా సరే నేరస్తులను వదిలే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. అటు టిడిపి కార్యకర్తలతో పాటుగా టిడిపి అనుకూల మీడియా కూడా ఈ అంశంపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని కొంత సీరియస్ గానే తీసుకున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

టీచర్లపై దాడిలో అరాచక...

విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్...

జగన్‌కు ఊహించని షాక్...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

టాలీవుడ్ కు ఏపీ...

తెలుగు చలనచిత్ర మరియు టెలివిజన్ రంగాలకు...

తప్పు చేసి కొత్త...

బెజవాడలో టీచర్లపై చేసిన దాడిని, తాము...

కూతురు పెళ్లిని అడ్డుపెట్టుకుని...

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా...

గులాబీ కోటలే రేవంత్...

తెలంగాణ రాజకీయ రంగంలో ఇప్పుడు ఉత్కంఠ...

పోల్స్