Sunday, June 21, 2026 11:08 AM
Sunday, June 21, 2026 11:08 AM

వైసీపీ ట్రాప్ లో పడొద్దు.. క్యాడర్ కి బాబు దిశానిర్దేశం

గత రెండు మూడు రోజుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టిడిపి కీలక నేతలకు మంత్రులకు పలు సూచనలు చేశారు. కాసేపటికి క్రితం టెలి కాన్ఫరెన్స్ ఏర్పాటుచేసిన.. సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా ఆసక్తికర కామెంట్స్ చేశారు. వైసిపి ట్రాప్ లో పడకుండా టీడీపీ వాళ్లు జాగ్రత్త పడాలని సూచించారు సీఎం. గత 20 నెలలుగా రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరుగుతోందని.. రాష్ట్ర అభివృద్ధి వైసీపీ నేతలకు నచ్చటం లేదు అంటూ ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకు వైసిపి ప్రయత్నం చేస్తుందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : అప్పుడు అత్యాశ పడ్డారు.. ఇప్పుడు బోల్తా పడ్డారు..!

వైసీపీ నేతలు ట్రాప్ లో కొంతమంది నాయకులు పడుతున్నారని.. దీనివల్ల కార్యకర్తలు కూడా రెచ్చిపోవాల్సిన పరిస్థితి వస్తుందంటూ కొంత చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. టిడిపి కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు చంద్రబాబు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో వైసిపి పబ్బం గడుపుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. అధికారం కోల్పోయామని అసహనంతో రాష్ట్రంలో హింసాపూరిత వాతావరణ సృష్టించేందుకు వైసిపి ప్రయత్నం చేస్తుందని చంద్రబాబు మండిపడ్డారు. పెట్టుబడులను సాధించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నదే మన ప్రధాన ఎజెండా అని తెలిపారు సీఎం.

Also Read : వైవీ సుబ్బారెడ్డి గారు.. ఈ ప్రశ్నలకు జవాబేది సార్..!

తప్పు చేసిన ప్రతి ఒక్కరికి చట్టపరంగా శిక్షలు ఉంటాయన్నారు. కార్యకర్తల సమయమును పాటించే విధంగా మంత్రులు, సీనియర్ నాయకులు బాధ్యత వహించాలన్నారు. కార్యకర్తలు వైసిపి ట్రాప్ లో పడుకున్నా నాయకులు జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. వైసీపీ నేతల కవింపు చర్యల పట్ల నేతలు అప్రమత్తంగా లేకపోతే భారీ నష్టం జరుగుతుందని హెచ్చరించారు సీఎం. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే వైసీపీ నేతలు బూతు పురాణం ఎత్తుకున్నట్లు పేర్కొన్నారు సీఎం. రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు వైసీపీ ప్లాన్ చేస్తోందని.. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి దీనిని తిప్పి కొట్టాలని సీఎం కోరారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

SBI వర్సెస్ తెలంగాణా...

రాయదుర్గం భూముల కేటాయింపు వ్యవహారంలో స్టేట్...

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

పోల్స్