Wednesday, August 5, 2026 12:55 PM
Wednesday, August 5, 2026 12:55 PM

ఆ ఆటగాడికి ఎందుకీ అన్యాయం..?

భారత జట్టులో ఫెయిల్ అయిన ఆటగాళ్లకు పదే పదే అవకాశాలు ఇస్తున్నారనే ప్రచారం జరుగుతున్నా సరే జట్టు యాజమాన్యం వైఖరిలో మాత్రం మార్పు లేదు. జట్టుకు సెలెక్ట్ అయి, నిలకడగా రాణించే ఆటగాళ్లకు కూడా అవకాశాలు ఇవ్వకుండా బెంచ్ కే పరిమితం చేస్తున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. తాజాగా మరో ఆటగాడి విషయంలో ఇప్పుడు అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సీనియర్ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ ను జట్టుకు సెలెక్ట్ చేసి కూడా పక్కన పెట్టారు.

Also Read : బూతులతో రెచ్చిపోయిన అంబటి..!

పదే పదే విఫలమైన రింకు సింగ్ సహా పలువురు ఆటగాళ్లకు అవకాశం ఇస్తూ.. నిలకడగా రాణించే అయ్యర్ కు నాలుగు మ్యాచ్ లలో ఒక్క దానిలో కూడా ఛాన్స్ ఇవ్వలేదు. ఇక ఇప్పుడు చివరి మ్యాచ్ కు కూడా అతనికి అవకాశం ఇచ్చే సంకేతాలు కనపడటం లేదని తెలుస్తోంది. జట్టు యాజమాన్యం ప్రామాణికంగా తీసుకునే ఐపిఎల్ లో అయ్యర్ రాణించాడు. వైట్ బాల్ క్రికెట్ లో అతను సమర్ధవంతంగా రాణిస్తున్న పరిస్థితి. అయినా సరే టి20 లలో అతనికి అవకాశం ఇవ్వడం లేదు యాజమాన్యం.

Also Read : అజిత్ మృతి.. బీజేపీకి గోల్డెన్ ఛాన్స్..!

టి20 వరల్డ్ కప్ విషయంలో కూడా అయ్యర్ కు అన్యాయం జరగడంపై ఫ్యాన్స్ విమర్శలు చేసారు. తాజాగా కివీస్ తో జరుగుతోన్న టి20 సీరీస్ లో కూడా అతనికి ఛాన్స్ లు ఇవ్వకపోవడం, మూడు ఫార్మాట్ లలో ఆడే సత్తా ఉన్న ప్లేయర్ ను కేవలం వన్డేలకు మాత్రమే పరిమితం చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. 2024 – 25 ఆస్ట్రేలియా పర్యటన, గత ఏడాది ఇంగ్లాండ్ పర్యటనకు కూడా అతనిని ఎంపిక చేయలేదు. దూకుడుగానే కాకుండా పక్కా డిఫెన్స్ టెక్నిక్ తో బ్యాటింగ్ చేయగలిగే సామర్ధ్యం ఉన్నప్పటికీ యాజమాన్యం పట్టించుకోవడం లేదు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

పోల్స్