Wednesday, February 4, 2026 08:00 AM
Wednesday, February 4, 2026 08:00 AM

గెట్ అవుట్.. అసలు తప్పు ఎవరిదీ..?

“గెట్ అవుట్ ఆఫ్ మై షో..” తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. నిజానికి ఈ మాటకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి.. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం సంబంధం లేదు. అయినా సరే.. కొందరు మాత్రం ప్రాంతీయ వాదం ముసుగులో ఈ మాటను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలుగుదేశం పార్టీకి ఆపాదిస్తూ.. ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే రాజకీయ చలి కాచుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. అయితే ప్రజలకు అన్ని వాస్తవాలు తెలుసు. సోషల్ మీడియా పుణ్యమా అని నిజమెంటో ఇట్టే తెలిసిపోతుంది. ఏదైనా ఘటన జరిగినప్పుడు ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు అనే విషయం ప్రజలు ఇట్టే పసిగడుతున్నారు.

రెండు రోజుల క్రితం ABN ఆంధ్రజ్యోతి ఛానల్‌లో ప్రతిరోజు సాయంత్రం నిర్వహించే ది డిబేట్ కార్యక్రమంలో జరిగిన ఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత కేటీఆర్ సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ వ్యవహారంపై డిబేట్ నిర్వహించారు. అందులో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ఈ డిబేట్ జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీ రవీందర్ రావు తమ పార్టీ స్టాండ్ వినిపించేందుకు వచ్చారు. మీడియాకు లీకులు అనే అంశంపై మాట్లాడుతున్నసమయంలో రవీందర్ రావు సహనం కోల్పోయారు. మీడియా సంస్థలతో పాటు పత్రికా ప్రతినిధులను కూడా కించపరిచే వ్యాఖ్యలు చేశారు. “ఏం రాస్తున్నారు.. ఈ పిచ్చి నా కొడుకులు..” అని నోరు జారారు.

Also Read : పార్టీలో అందరి తాట తీస్తానంటున్న విజయ్..!

రవీందర్ రావు చేసిన వ్యాఖ్యల పట్ల డిబేట్ నిర్వహిస్తున్న ప్రెజెంటర్ పర్వతనేని వెంకటకృష్ణ.. ముందు చాలా సున్నితంగా, మృదువుగానే బ్రేకులు వేసేందుకు ప్రయత్నం చేశారు. మీరు ఇలా వ్యాఖ్యలు చేయటం తప్పు.. వెంటనే వాటిని వెనక్కి తీసుకోండి ప్లీజ్.. అని విజ్ఞప్తి చేశారు. అయితే సహనం కోల్పోయిన రవీందర్ రావు.. నేను తగ్గేది లేదు.. వెనక్కి తీసుకునేది లేదు.. అని ఖరాఖండిగా చెప్పేశారు. దీంతో వెంకటకృష్ణ “గేట్ అవుట్ ఆఫ్ మై డిబేట్” అని చెప్పేశారు. అయినా సరే.. రవీందర్ రావు ఇంకా గట్టిగా అరవటంతో.. కట్ చేయండి.. అంటూ ప్యానల్‌ను వెంకటకృష్ణ ఆదేశించారు. దీంతో వెంటనే రవీందర్ ఆడియో, వీడియో కట్ చేశారు. అలా కట్ చేసిన తర్వాత.. వెంటనే వెంకటకృష్ణ క్లారిటీ ఇచ్చేశారు. ఇలా నోరు పారేసుకుని.. ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోమంటే.. నేనింతే అనే అహంకారం చూపిస్తే ఎలా అని వ్యాఖ్యానించారు.

అయితే ఇక్కడ తప్పు ఎవరిదీ అనే చర్చ జోరుగా జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో వెంకటకృష్ణ తప్పు చేసినట్లుగా బీఆర్ఎస్ చూపిస్తోంది. ఈ సాకుతో చూపిస్తూ.. “ఏబీఎన్ ఛానెల్‌లో జరిగే చర్చల్లో ఇక నుండి బీఆర్ఎస్ నాయకులు పాల్గొనరు. పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో కానీ, జిల్లా కార్యాలయాల్లో కానీ జరిగే పార్టీ సమావేశాలకు ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రతినిధులను ఇకపై అనుమతించరాదని పార్టీ నిర్ణయించడం జరిగింది.” అంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. కానీ నిజానికి తప్పు చేసింది రవీందర్ రావు. నోరు పారేసుకుంది రవీందర్ రావు. వ్యాఖ్యలు వెనక్కి తీసుకునేది లేదన్నది రవీందర్ రావు. అందుకే వెంకటకృష్ణ గెట్ అవుట్ అన్నారు. అందులో తప్పేంటి.

కానీ.. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు మాత్రం ఈ వంకతో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టేందుకు నానా పాట్లు పడుతున్నారు. తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు పట్ల ఏబీఎన్ ఛానెల్‌ ప్రతినిధి వెంకటకృష్ణ వ్యవహరించిన తీరుకు నిరసనగా.. అని వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి తక్కెళ్లపల్లి రవీందర్ రావు.. తెలంగాణ ఉద్యమకారుడు ఎలా అయ్యాడో ఆ పార్టీ నేతలే చెప్పాలి. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభించినప్పుడు రవీందర్ రావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. టీడీపీలో గ్రామ పార్టీ అధ్యక్ష స్థానం నుంచి ఉమ్మడి వరంగల్‌ జిల్లా సంయుక్త కార్యదర్శిగా వివిధ హోదాల్లో పనిచేసి 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశించాడు. కొన్ని కారణాల వల్ల వేం నరేందర్‌రెడ్డికి టికెట్ దక్కడంతో ఆయన గెలుపు కోసం పనిచేశాడు. ఇంకా చెప్పాలంటే.. టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి కోసం శాయశక్తుల పని చేశారు. ఆ తర్వాత మహబూబాబాద్ నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్ కావడంతో.. సైలెంట్‌గా కారు పార్టీలో చేరిపోయారు. అప్పటి వరకు కేసీఆర్‌ను తిట్టిన నోటితోనే.. అప్పటి నుంచి జై కేసీఆర్ అనటం మొదలుపెట్టారు.

Also Read : డైట్ కంటే టైం ముఖ్యమా..? డాక్టర్ సంచలన విషయాలు..!

రవీందర్ రావు 2007లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. వరంగల్‌ జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షునిగా, రాష్ట్ర కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా వివిధ హోదాల్లో పనిచేశాడు. నిజానికి ఉద్యమం తొలినాళ్లల్లో రవీందర్ టీఆర్ఎస్‌లో లేడు. శ్రీకాంత చారీ వంటి ఎంతో మంది విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకున్న సమయంలో ఆయన ఉద్యమంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో టీడీపీ, టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా టీడీపీ తరఫున ప్రచారం చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి తెలుగుదేశం పార్టీపై విషం చిమ్మటం ప్రారంభించారు. ఇప్పుడు కూడా తాను నిజమైన తెలంగాణ ఉద్యమ కారుడిని అని.. తనపై టీడీపీ అనుకూల మీడియా ద్వారా కించపరిచేలా అవమానపరిచారని వాపోతున్నారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. పెద్దల సభకు ప్రాతినిధ్యం వహించే సీనియర్ నేత.. భాష గురించి ప్రత్యేకంగా చర్చించుకోవాలి. పెద్దల సభలో ఉంటున్నామనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా.. పిచ్చి నా కొడుకులు అనే పదాన్ని ఎలా అంటారు. అందుకే వెంకటకృష్ణ గెట్ అవుట్ అన్నారు.

ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. వెంకటకృష్ణను ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి అని.. ఆయన కులాన్ని ఆపాదిస్తూ.. ఆయన వ్యాఖ్యల వెనుక తెలుగుదేశం పార్టీ పెద్దల హస్తం ఉందంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిజానికి వెంకటకృష్ణ స్వగ్రామం ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు నియోజకవర్గంలో ఓ పల్లెటూరు. ఈనాడు, ఈటీవీలో మండల స్థాయి నుంచి మొదలైన వెంకటకృష్ణ ప్రయాణం.. జిల్లా, రాష్ట్రస్థాయికి చేరుకుంది. ఏ రోజూ తన డిబేట్‌లో కించపరిచేలా వెంకటకృష్ణ వ్యవహరించలేదు. మరో విషయం ఏమిటంటే.. వెంకటకృష్ణ టీడీపీకి వ్యతిరేకంగా కూడా డిబేట్‌లు నిర్వహించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న కొన్ని నిర్ణయాలపై కూడా వెంకటకృష్ణ డిబేట్ చేశారు. తాను నక్సల్ ప్రాంతానికి చెందిన వ్యక్తిని అని.. తనలో ఉద్యమ భావజాలం ఉందని చాలాసార్లు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. మరి అలాంటి వెంకటకృష్ణను కులం పేరుతో, ప్రాంతం పేరుతో బీఆర్ఎస్ నేతలు టార్గెట్ చేయడం.. ఇప్పుడు ఆ పార్టీ దిగజారుడు తనానికి నిదర్శనమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్