Saturday, September 19, 2026 08:13 PM
Saturday, September 19, 2026 08:13 PM

బాలీవుడ్ ఈజ్ బ్యాక్..? రెండు సినిమాలతో ఫుల్ జోష్..!

సౌత్ ఇండియా సినిమా డామినేషన్ తో గత పదేళ్ళ నుంచి బాలీవుడ్ లో జోష్ తగ్గుతూ వచ్చింది. ఎప్పుడో ఒక సినిమా మినహా బాలీవుడ్ ప్రభావం చూపడంలో ఫెయిల్ అయింది అనే చెప్పాలి. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ సినిమా అనే రేంజ్ కు వెళ్ళినా.. బాహుబలి, కేజిఎఫ్ సహా పలు సినిమాల దెబ్బకు బాలీవుడ్ ఇబ్బంది పడింది. అక్కడి నటులు కూడా తెలుగు లేదా తమిళ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపించారు. ఇక ప్రభాస్ సినిమాల ప్రభావం గట్టిగానే పడింది అని చెప్పుకోవచ్చు.

Also Read : పొలిటికల్ బ్యాక్ డ్రాప్.. బాలయ్య కోసం మలినేని ప్లాన్..!

సీనియర్ హీరోల సినిమాలకు కూడా పెద్దగా రెస్పాన్స్ రాని పరిస్థితి. అలాంటిది రెండు సినిమాలు బాలీవుడ్ కు మంచి బూస్ట్ ఇచ్చాయి. గత ఏడాది రిలీజ్ అయిన ఛావా, దురంధర్, ఈ ఏడాది వచ్చిన బోర్డర్ 2 సినిమాలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్ 5న విడుదలైన ధురంధర్ సినిమా బాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. భారత్ లో ఈ సినిమా రూ. 832.05 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 1292.2 కోట్లు వసూలు చేసింది. దీనితో మార్చి 19న విడుదల కానున్న రాబోయే సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి.

Also Read : పద్మ పురస్కారాల లక్ష్యం అదేనా..!

జనవరి 23న విడుదలైన బోర్డర్ 2 , మొదటి మూడు రోజుల్లోనే దేశంలో రూ.121 కోట్ల నికర వసూళ్లను, ప్రపంచవ్యాప్తంగా రూ.158.3 కోట్ల నికర వసూళ్లను సాధించింది. సన్నీ డియోల్, వరుణ్ ధావన్, అహన్ శెట్టి, దిల్జిత్ దోసాంజ్ నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 1971లో జరిగిన భారత్ – పాకిస్తాన్ యుద్ధం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇటీవల వచ్చిన ఇక్కీస్ సినిమాకు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో బాలీవుడ్ పండుగ చేసుకుంటుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్