ఎలాగైనా సరే ఇరాన్ ను తమ ఆధీనంలోకి తీసుకోవాలని అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోన్న అమెరికా.. ఇప్పుడు ఇరాన్ లో జరుగుతున్న అల్లర్లను సీరియస్ గా తీసుకుని అడుగులు వేస్తోంది. తమ సైనిక, ఆయుధ బలంతో ఇరాన్ పై ఆధిపత్యం చెలాయించేందుకు అమెరికా సర్కార్ ప్రయత్నాలు వేగవంతం చేసింది. ఓ వైపు ఇజ్రాయిల్, మరో వైపు అమెరికా దెబ్బకు ఇరాన్ ఇబ్బంది పడుతోంది. ఇజ్రాయిల్ తో యుద్దంలో సమర్ధవంతంగా పోరాటం చేసిన ఇరాన్.. ఇప్పుడు అమెరికా రాకతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
Also Read : గోదారమ్మకు మూడవ సారి చంద్రబాబు పుష్కర హారతి..!
ఈ నేపధ్యంలో అంతర్జాతీయ విమానయాన సంస్థలు ఇప్పుడు మరోసారి ఇబ్బంది పడుతున్నాయి. డచ్ కేఎల్ఎం, లుఫ్తాన్సా, ఎయిర్ ఫ్రాన్స్ ఇప్పటికే ఇరాన్ భూభాగంలో తమ విమానాలను ఆపేశాయి. ఇటు భారత్ కూడా తమ పౌరులను హెచ్చరించింది. ఇతర ఆసియా దేశాలు కూడా తిరిగి తమ తమ దేశాలకు రావాలని కోరాయి. ఇక విమానాల రద్దు కారణంగా ఇజ్రాయెల్, దుబాయ్, రియాద్ వంటి గమ్యస్థానాలకు వెళ్ళే వారికి ఇబ్బంది ఎదురైంది. అంటే లండన్, అమెరికా సహా యూరప్ దేశాలపై ఈ ప్రభావం పడుతుంది.
Also Read : వాళ్లు చట్టానికి అతీతులా.. విచారిస్తే తప్పేంటి..?
భౌగోళిక రాజకీయ పరిస్థితిని ప్రస్తావిస్తూ.. ఎయిర్ ఫ్రాన్స్ దుబాయ్‌కు సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. సైనిక చర్యకు అవకాశాలు తక్కువగా ఉన్నాయని గతంలో సూచనలు వచ్చినా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇరాన్ వైపు తమ బలగాలు వెళ్తున్నాయి అన్నారు. ఇక నిరసనలు చేస్తున్న వారి ఉరి శిక్షలను.. అమెరికా హెచ్చరికలతో ఇరాన్ ఆపేసింది. కానీ అమెరికా మాత్రం తమ బలగాలను తరలించడంతో యుద్ద మేఘాలు కమ్ముకున్నాయి.

