Wednesday, February 4, 2026 12:43 PM
Wednesday, February 4, 2026 12:43 PM

చంద్రబాబును తప్పుదోవ పట్టిస్తున్నారా..?

2024లో మరోసారి అధికారం చేపట్టిన తర్వాత, కూటమి ప్రభుత్వం అమరావతిని భారతదేశ భవిష్యత్తు “క్వాంటం వ్యాలీ” కి కేంద్రంగా బలంగా చూపిస్తోంది. తరచు “సిలికాన్ వ్యాలీ నుండి క్వాంటం వ్యాలీ వరకు” వంటి పదాలను కూడా చంద్రబాబు వాడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారికంగా ఆమోదించిన అమరావతి క్వాంటం వ్యాలీ డిక్లరేషన్, నిర్దిష్టమైన, నాటి నిబద్ధతలను నిర్దేశించింది. జనవరి 1, 2026 నాటికి అమరావతిలో ప్రముఖ సంస్థ IBM.. తన క్వాంటం సిస్టమ్ ను ఏర్పాటు చేస్తుందని, అలాగే రాష్ట్రం 100 క్వాంటం అల్గారిథమ్‌లను పరీక్షించే సామర్థ్యాన్ని పొందుతుందని స్పష్టం చేసింది.

Also Read : అసెంబ్లీలో కూడా అలా చేస్తారా..?

నిజానికి ఇవి ప్రభుత్వం స్వయంగా ఇచ్చిన అధికారిక హామీలు. ఇవి గాలి వాటంతో చెప్పిన మాటలు కాదు. జూలై 7, 2025వ తేదీన ప్రభుత్వం పేరుతో బహిరంగ ప్రకటన వెలువడింది. క్వాంటమ్ వ్యాలీలో 2029 నాటికి ఒక బిలియన్ డాలర్ల ప్రతిపాదిత పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. అయితే వాస్తవ రూపం వేరుగా ఉంది. 2026 జనవరి నెల చివరి వారానికి వచ్చేసింది. ఇప్పటి వరకు IBM సంస్థ క్వాంటమ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయలేదు. పైగా క్వాంటం పరీక్షా సామర్థ్యాన్ని సాధించలేదు. దీంతో ఈ హామీల వల్ల కూటమి ప్రభుత్వం ఇబ్బందుల పాలవుతుందనే మాట పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తోంది.

నిజానికి క్వాంటమ్ కంప్యూటింగ్‌ సిస్టమ్ ప్రారంభించేందుకు సరైన బోధనా సిబ్బంది లేరనేది వాస్తవం. ఏపీలో ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని బోధనా సిబ్బందిలో మూడింట ఒకవంతు మాత్రమే పని చేస్తుంది. దాదాపు 60 శాతం అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 20కి పైగా విద్యా కార్యక్రమాలు ఒక్క శాశ్వత ఉపాధ్యాయుడు కూడా లేకుండా నడుస్తున్నాయి. ఇవి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అంశాలు. దాదాపు 200 మంది భౌతిక శాస్త్ర విద్యార్థులకు కేవలం ముగ్గురు, నలుగురు అధ్యాపకులతో క్వాంటం కంప్యూటింగ్‌లో బి టెక్ కోర్సును ప్రారంభించడం కష్టమంటున్నారు నిర్వాహకులు.

Also Read : విజయసాయి రెడ్డి తర్వాత అన్నకే ఈడీ ఆహ్వానం..?

ముఖ్యమంత్రితో IBM సంస్థ ప్రతినిధులు భేటీ అయిన సందర్భంలో ఈ విషయాలను అధికారులు దాచి పెట్టినట్లు తెలుస్తోంది. వాస్తవ పరిస్థితులను అధికారులు మసి పూసి మారేడు కాయ చేయడంతో.. సీఎం చంద్రబాబు కూడా అధికారులు చెప్పిన ప్రకారం జనవరిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సిస్టమ్ జనవరిలో ప్రారంభం అవుతుందని గొప్పగా ప్రకటించారు. ఇప్పుడు ఆ హామీ నెరవేరే అవకాశం లేకపోవడంతో.. ప్రతిపక్షాల విమర్శలు ఎదుర్కొవాల్సిన పరిస్థితులు కూటమి సర్కార్ ముందు ఉన్నాయి. ఇప్పటికైనా ఇలాంటి తప్పుడు నివేదికలు ఇచ్చే అధికారులను సీఎం చంద్రబాబు పక్కన పెట్టాలని పలువురు కోరుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

పోల్స్