Wednesday, August 5, 2026 10:27 AM
Wednesday, August 5, 2026 10:27 AM

రాహుల్ ను ఇంకా ఎందుకు వాడట్లేదు..? షాక్ లో మాజీలు..!

టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్, లోయర్ మిడిల్ ఆర్డర్.. కీపింగ్, కెప్టెన్సీ, ఓపెనింగ్, దుర్యోధ్యమైన డిఫెన్స్, అవసరమైతే హిట్టింగ్, ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేయగలిగే కెపాసిటీ.. జట్టు కోసం ఒక బౌలింగ్ తప్ప మిగిలినది ఏది చేయడాకైనా సిద్ధంగా ఉండే మనస్తత్వం.. బహుశా ఇది ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. టీమిండియా స్టార్ ఆటగాడు కన్నూర్ లోకేష్ రాహుల్ గురించి. భారత జట్టుకు అత్యంత కీలక ఆటగాళ్లలో ఒకడిగా ఉన్న రాహుల్ గత రెండేళ్లుగా మంచి ఫామ్ లో ఉన్నాడు. 2024 ఆస్ట్రేలియా పర్యటన నుంచి నిలకడగా రాణిస్తున్నాడు రాహుల్.

Also Read : కోడి పందాల జోష్.. ప్రభుత్వానికి భారీ ఆదాయం..

గత ఏడాది ఐపిఎల్ సీజన్ లో సైతం అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత టెస్ట్ క్రికెట్లో ఓపెనర్ గా సెటిల్ అయిపోయిన రాహుల్.. వన్డే క్రికెట్ విషయంలో మాత్రం ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పటికే రాహుల్ ను టీ20 లకు తప్పించారు సెలెక్టర్లు. వన్డే క్రికెట్ లో కెప్టెన్సీ సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా అతనిని వాడుకోలేకపోతోంది టీమిండియా యాజమాన్యం. మొన్న జరిగిన రెండవ వన్డేలో భారత జట్టు ఓటమికి కెప్టెన్సీ వైఫల్యమే ప్రధాన కారణం. ఈ మ్యాచ్ లో రాహుల్ సెంచరీ చేసి జట్టును ఆదుకున్నాడు. కీలక సమయంలో అతను ఆడిన ఇన్నింగ్స్ కారణంగా భారత్ పోరాడే లక్ష్యాన్ని కివిస్ ముందు ఉంచగలిగింది.

Also Read : మంత్రుల మాటకు విలువ ఎక్కడ..?

అయితే రాహుల్ ఓపెనర్ గా ఆడితే మంచి ఫలితం ఉంటుంది అనే అభిప్రాయం వినపడుతోంది. గిల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయాలని క్రికెట్ అభిమానులు సూచిస్తున్నారు. విరాట్ కోహ్లీ మాదిరిగా గిల్ కూడా మిడిల్ ఆర్డర్ మీదనే ఎక్కువగా ఫోకస్ పెట్టి ఆడితే మంచి ఫలితాలు ఉంటాయి అని సూచిస్తున్నారు. వన్డే క్రికెట్ లో మూడో స్థానంలో ఆడే కోహ్లీ టెస్ట్ క్రికెట్ లో మాత్రం నాలుగో స్థానంలోనే ఆడాడు. గిల్ కొత్త బంతితో ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి విరాట్ కోహ్లీ తరహాలో టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ ను సమన్వయం చేసుకుంటూ ఆడే మూడు లేదా నాలుగు స్థానాల్లో బ్యాటింగ్ చేస్తే మంచిది అంటున్నారు పరిశీలకులు. కాబట్టి వన్డే క్రికెట్ లో కూడా రాహుల్ ఓపెనర్ గా ఆడితే భవిష్యత్తులో మంచి ఫలితాలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్