Wednesday, February 4, 2026 06:37 AM
Wednesday, February 4, 2026 06:37 AM

రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ప్రివ్యూ రిపోర్ట్

రవితేజ హీరోగా, కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ముందు నుంచే ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమా టోన్‌ను స్పష్టంగా చూపించడమే కాకుండా, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోందనే అభిప్రాయాన్ని కలిగించింది. ఇక తాజాగా ఇండస్ట్రీలోని కొంతమంది ప్రముఖ సినీ సెలబ్రిటీల కోసం స్పెషల్ ప్రివ్యూ షో నిర్వహించినట్టు సమాచారం. ఆ షో నుంచి వచ్చిన టాక్ ఆధారంగా ఈ సినిమాపై ఫస్ట్ రివ్యూ ఎలా ఉందో చూద్దాం.

Also Read : పీక్స్ కు ఫ్యాన్స్ వార్.. రగిలిపోతున్న రెబల్ ఫ్యాన్స్..!

కథ విషయానికి వస్తే, రవితేజ డింపుల్ హయతిని వివాహం చేసుకుని సాదాసీదాగా జీవితాన్ని కొనసాగిస్తున్న వ్యక్తిగా కనిపిస్తాడు. అదే సమయంలో అతని జీవితంలోకి ఆషిక రంగనాథన్ ప్రవేశిస్తుంది. ఈ పరిచయం ప్రేమగా మారడంతో, రవితేజ రెండు వైపులా ఒత్తిడిని ఎదుర్కొంటాడు. ఒకవైపు భార్యతో ఏర్పడే భావోద్వేగ సంఘర్షణలు, మరోవైపు ప్రేయసి పెళ్లి గురించి చేసే ప్రశ్నలు—ఈ రెండింటి మధ్య చిక్కుకున్న వ్యక్తిగా రవితేజ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు అన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

ఈ చిత్రంలో రవితేజ ఫుల్ లెంగ్త్ కామెడీ పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఆయన టైమింగ్, బాడీ లాంగ్వేజ్, ఎక్స్‌ప్రెషన్స్ ఈ క్యారెక్టర్‌కు ప్రధాన బలంగా నిలిచాయట. అదే సమయంలో దర్శకుడు భార్యాభర్తల మధ్య ఉండే రిలేషన్‌షిప్ డైనమిక్స్‌ను చాలా నేచురల్‌గా ప్రెజెంట్ చేశాడని సమాచారం. ముఖ్యంగా రవితేజ తన భార్యను ఎలా ట్రీట్ చేస్తాడు, ఆ బంధంలో వచ్చే మార్పులు కథకు మంచి ఎమోషనల్ డెప్త్‌ను తీసుకువచ్చాయట. భార్యాభర్తల మధ్య ఎమోషన్స్, గొడవలు, అపార్థాలపై ఇప్పటికే అనేక సినిమాలు వచ్చినప్పటికీ, ఈ కాన్సెప్ట్ ప్రేక్షకులను ఎప్పటికీ ఆకర్షిస్తూనే ఉంటుంది.

Also Read : ‘రాజా సాబ్’ మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్ల అంచనాలు తారుమారు

ఈ సినిమాలో భార్య చేతిలో, ప్రేయసి చేతిలో నలిగిపోయే పాత్రలో రవితేజ చాలా సెటిల్డ్ మరియు మెచ్యూర్ పర్ఫామెన్స్ ఇచ్చినట్టుగా టాక్ వినిపిస్తోంది. కామెడీతో పాటు ఎమోషన్‌ను బ్యాలెన్స్ చేయడంలో ఆయన మరోసారి తన అనుభవాన్ని చూపించినట్టు తెలుస్తోంది. టెక్నికల్ అంశాల పరంగా చూస్తే, పాటలు కథలోకి సాఫీగా ఫిట్ అయినప్పటికీ, ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా ఎమోషనల్ సీన్స్‌ను మరింత ఎలివేట్ చేసిందని సమాచారం. కొన్ని కీలక సన్నివేశాల్లో మ్యూజిక్ ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేసేలా ఉందట. అలాగే ఫ్యామిలీ ఆడియెన్స్‌కు నచ్చేలా డైలాగ్స్ రాసిన విధానం కూడా ప్లస్ పాయింట్‌గా నిలిచినట్టు తెలుస్తోంది.

మొత్తంగా చూస్తే, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా, ఎమోషన్ మరియు కామెడీ మేళవింపుతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. రవితేజ అభిమానులతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి ఈ సినిమాకు ఎంతవరకు ఆదరణ లభిస్తుందో విడుదల తర్వాత చూడాల్సిందే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్