Wednesday, February 4, 2026 10:48 AM
Wednesday, February 4, 2026 10:48 AM

కేంద్రంపై దగ్గుబాటి సురేష్ బాబు విమర్శలు..!

పెద్ద పండుగలు సంక్రాంతి, దసరా వచ్చాయి అంటే చాలు.. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ఏ స్థాయిలో ట్రాఫిక్ ఉంటుందో మనం చూస్తూనే ఉంటాం. రోడ్డు ఎంత విస్తరణ చేసినా సరే ట్రాఫిక్ మాత్రం కట్టడి కావడం లేదనేది స్పష్టంగా అర్ధమవుతోంది. ఇక ఇప్పుడు సంక్రాంతి పండుగ కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. హైదరాబాద్–విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ అయింది. హైదరాబాద్ నుంచి చౌటుప్పల్ దాటడానికే 2–3 గంటల సమయం పడుతోంది.

Also Read : రోడ్డు ప్రమాదాల కట్టడికి వీ టూ వీ టెక్నాలజీ.. కేంద్రం కీలక అడుగు..!

షార్ట్‌ కట్ రోడ్డు మార్గాలు వెతుకుతున్న కార్ల ప్రయాణికులు.. ఆ మార్గాల్లో కూడా ట్రాఫిక్ ఉండటంతో తల పట్టుకుంటున్నారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు 9 – 10గంటల ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఇక హైవే పనులు జరుగుతుండడంతో వాహనదారుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద భారీగా ట్రాఫిక్‌ జాం అయింది. దీనితో అటు వైపుగా వెళ్తున్న నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు కారు దిగి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. హైదరాబాద్ నుంచి కోలవెన్ను వెళ్తున్నారు దగ్గుబాటి సురేష్ బాబు.

Also Read : ‘రాజా సాబ్’ మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్ల అంచనాలు తారుమారు

ఇక రోడ్ల మరమ్మత్తులపై సురేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నందిగామ వద్ద ట్రాఫిక్ జామ్ ను క్లియర్ చేసిన నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు.. జాతీయ రహదారి మంత్రిత్వ శాఖ విలైనంత వరకు రోడ్డు మరమ్మతులు చేస్తే త్వరగా రోడ్లు బాగుచేస్తే బాగుంటుందన్నారు. ఈ సంక్రాంతి 5 రోజులు హైవే పై వాహనాల రద్దీ ఉంటుందని తెలుసు కదా అని ప్రశ్నించారు. వీలైనంత త్వరగా రోడ్లు పూర్తి చేస్తే బాగుంటుందన్నారు. 6:30 గంటలకు బయలుదేరితే 6 గం ” పైగా విజయవాడ కు సమయం పట్టిందని.. తెలంగాణ లో టోల్ గేట్ లు ఎత్తివేయడం చాలా బాగుందని కొనియాడారు. రోడ్ డైవర్షన్ లు లేకుండా ఉండాలని కోరుకుంటున్నా అంటూ అభిప్రాయపడ్డారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్