Wednesday, May 6, 2026 07:21 PM
Wednesday, May 6, 2026 07:21 PM

‘రాజా సాబ్’ మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్ల అంచనాలు తారుమారు

రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘రాజా సాబ్’ నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైంది. అయితే విడుదలైన తొలిరోజే సినిమాకు మిశ్రమంగా చెప్పాలంటే ప్రతికూల టాక్ ఎదురైంది. ఆ నెగిటివ్ బజ్ ప్రభావం ముఖ్యంగా నూన్ మరియు మ్యాట్నీ షోలపై గట్టిగా కనిపించినప్పటికీ, ఫస్ట్ షోల నుంచే క్రమంగా పికప్ నమోదైంది. ఇక సెకండ్ షోలకల్లా చాలా సెంటర్లలో ఆశించిన దానికంటే మెరుగైన ఆక్యుపెన్సీతో వసూళ్లు ఊపందుకున్నాయి. ఫ్లాప్ టాక్ నేపథ్యంలో ఘోరమైన ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేసినా, ప్రభాస్ స్టార్ ఇమేజ్‌కు తగ్గట్టుగా సినిమా చివరకు గౌరవప్రదమైన ఓపెనింగ్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా నైజాం ప్రాంతంలో ఈ చిత్రం డీసెంట్ స్థాయి వసూళ్లను నమోదు చేయడం విశేషం.

Also Read : వైరస్ తో వణికిపోతున్న అమెరికా.. పిల్లలు జాగ్రత్త..!

ఈ ప్రాంతంలో ప్రీమియర్ షోలు పరిమితంగా ఉండటం సినిమాకు అదనపు ప్లస్‌గా మారిందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, నైజాం ప్రాంతంలో మొదటి రోజు గ్రాస్ వసూళ్లు రూ.18.6 కోట్లుగా నమోదయ్యాయి. ఇక్కడి నుంచి షేర్ వసూళ్లు సుమారు రూ.12 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. అదే విధంగా ఆంధ్రా మరియు సీడెడ్ ప్రాంతాల నుంచి రూ.34 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు సమాచారం. మొత్తంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఈ చిత్రానికి రూ.52.6 కోట్ల గ్రాస్, రూ.34 కోట్ల షేర్ వసూళ్లు వచ్చాయి. వచ్చిన టాక్‌ను దృష్టిలో పెట్టుకుంటే, ఇవి చెప్పుకోదగ్గ డీసెంట్ షేర్ వసూళ్లుగానే భావించాలి.

Also Read : రఫ్‌గా వచ్చేసింది… సమంత మాస్ రీఎంట్రీ!

ఇక ఓవర్సీస్ మార్కెట్ నుంచి రూ.27 కోట్ల గ్రాస్ మాత్రమే రావడం కొంత నిరాశ కలిగించినప్పటికీ, కర్ణాటక నుంచి రూ.6 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి రూ.8 కోట్లు గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి. మొత్తంగా చూస్తే, వరల్డ్‌వైడ్‌గా ‘రాజా సాబ్’ తొలి రోజు గ్రాస్ వసూళ్లు రూ.93.6 కోట్లకు చేరాయి. తెలుగు రాష్ట్రాల్లో రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’, పవన్ కళ్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’ చిత్రాలతో పోలిస్తే ఓపెనింగ్ వసూళ్లు కొంత తక్కువగా ఉన్నప్పటికీ, ఓవర్సీస్ మార్కెట్‌లో ఆ చిత్రాలతో పోల్చితే డీసెంట్ వసూళ్లు సాధించడం ద్వారా ప్రభాస్ తన స్టార్ ఇమేజ్‌కు తగిన ఓపెనింగ్‌ను దక్కించుకున్నారు.

అభిమానులకు తొలి రోజు రూ.100 కోట్ల గ్రాస్ మిస్ అయ్యిందనే కొంత నిరాశ ఉండొచ్చు. అయితే ప్రతికూల టాక్ మధ్య ఈ స్థాయి వసూళ్లను సాధించగలగడం ప్రభాస్ స్టార్ స్టేటస్‌కు నిదర్శనమని చెప్పాలి. ఈ ఓపెనింగ్‌తో మరోసారి ఆయన మార్కెట్ స్థాయిని ట్రేడ్ వర్గాలు స్పష్టంగా గమనించగలిగాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

నిజంగా కేసీఆర్ కు...

తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, విపక్ష...

పోల్స్