Wednesday, August 5, 2026 12:54 AM
Wednesday, August 5, 2026 12:54 AM

వైరస్ తో వణికిపోతున్న అమెరికా.. పిల్లలు జాగ్రత్త..!

ప్రతీ ఏటా చలికాలంలో ఏదోక వైరస్ వ్యాపిస్తునే ఉంటుంది. ఇప్పుడు మరో వైరస్ అమెరికా సహా పలు దేశాలను కంగారు పెడుతోంది. కరోనా వంటి వైరస్ ల వ్యాప్తితో తీవ్రంగా ఇబ్బంది పడిన అమెరికా.. ఇప్పుడు మరో వైరస్ తో చుక్కలు చూస్తోంది. గత ఏడాది చివరి నాటికి ఇన్ఫ్లుఎంజా వ్యాప్తికి అమెరికా అల్లాడిపోయింది. చిన్న పిల్లలు, యుక్త వయసులో ఉన్న వారికి ఈ వైరస్ ఇబ్బందికరంగా మారింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు కనీసం 11 మిలియన్ల మంది ఫ్లూ బారిన పడ్డారు.

Also Read : అమిత్ షాతో చంద్రబాబు హడావుడి భేటీ.. కారణమేంటి?

5,000 మంది మరణించారని యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సోమవారం విడుదల చేసిన డేటాలో పేర్కొంది. 2020లో కరోనా రాకముందు నుండి ఫ్లూ లాంటి అనారోగ్య సమస్యలకు వైద్యుల కొరత లేకుండా చికిత్స అందించే వారు. కానీ ఇప్పుడు వైరస్ వ్యాప్తి వేగంగా ఉండటంతో వైద్యుల కొరత కూడా ఏర్పడింది. దీనిపై టీకాలను పెద్ద ఎత్తున అందిస్తున్నా సరే.. వేగంగా షాట్స్ పడటం లేదని అక్కడి మీడియా తెలిపింది. గత ఏడాదిలో కేవలం 43 శాతం మంది సీనియర్ సిటిజన్ లకు మాత్రమే టీకా ఇచ్చారు.

Also Read : తెలంగాణాలో జనసేనాని అడుగులు..? కొండగట్టు నుంచే వార్ షురూ..?

సూపర్ ఫ్లూగా పిలుస్తున్న కొత్త వేరియంట్ ద్వారా వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఇది కొత్త మ్యూటేషన్ గా వైద్యులు చెప్తున్నారు. దీనితో ఇప్పటి వరకు ఇచ్చిన టీకాలు దీనికి సరిపోవడం లేదు. ఇక ఈ వైరస్ ఎంత బలంగా ఉంది.. దాని ప్రభావం ఎన్నాళ్ళు ఉంటుంది అనేది చెప్పలేమని అక్కడి నిపుణులు అంటున్నారు. ఈ సీజన్‌ లో ఇప్పటికే తొమ్మిది మంది పిల్లలు ఫ్లూతో మరణించారు. గత ఏడాది దాదాపుగా 300 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. సాధారణంగా అమెరికాలోని ఆగ్నేయంలో ప్రారంభమయ్యే ఇన్‌ ఫ్లుయెంజా, తరువాత నెమ్మదిగా ఉత్తరం, పశ్చిమానికి వ్యాప్తి చెందుతూ ఉంటుంది. కానీ ఈసారి తూర్పు అమెరికాలో ఎక్కువగా ఉన్నట్లుగా గుర్తించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్