Wednesday, August 5, 2026 04:38 PM
Wednesday, August 5, 2026 04:38 PM

చంద్రబాబు నాయుడు – గ్రీన్‌ఫీల్డ్ ఆర్కిటెక్ట్

ఇటీవల ముంబై మహానగరంలో రెండో విమానాశ్రయం పూర్తయింది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రణాళికలు 90వ దశకంలోనే ప్రారంభమయ్యాయి. అంటే దేశ ఆర్థిక రాజధానిలో రెండో విమానాశ్రయం నిర్మాణానికి పాతికేళ్లకు పైగా సమయం పట్టింది. అదే విధంగా బెంగళూరులో రెండో విమానాశ్రయం కోసం గత పదేళ్లుగా స్థల అన్వేషణ కొనసాగుతున్నప్పటికీ, ప్రాజెక్ట్ ప్రారంభం, పూర్తి తేదీలపై ఇప్పటికీ స్పష్టత లేదు.

ఈ నేపథ్యంలో విశాఖపట్నం సమీపంలోని భోగాపురంలో నిర్మించిన ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు ప్రత్యేకతను సంతరించుకుంది. విమానాశ్రయం నిర్మాణం పూర్తై, ప్రస్తుతం ట్రయల్‌ రన్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాబోయే ఆరు నెలల్లో కమర్షియల్‌ ఆపరేషన్స్‌ ప్రారంభం కానున్నాయి. ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో దశాబ్దాలు పట్టిన పని, విశాఖలో రెండేళ్లలోపే పూర్తవడం వెనుక ప్రధానంగా ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

Also Read : బీఆర్ఎస్ కొత్త బాస్ ఫిక్స్..!

తెలంగాణ విభజన అనంతరం కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు, 2016లోనే భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలనే దృఢమైన ప్రణాళిక రూపొందించారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసి అన్ని అనుమతులు పొందడం, భూసేకరణను పూర్తిచేయడం ద్వారా 2019లో విమానాశ్రయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.

అయితే అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను నిలిపివేసింది. 2023లో అప్పటి ముఖ్యమంత్రి జగన్ మరోసారి శంఖుస్థాపన చేసినప్పటికీ, పనులు వేగం అందుకోలేదు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు భోగాపురం ఎయిర్‌పోర్టు పనులకు ప్రాధాన్యత ఇచ్చి, వేగవంతం చేశారు. కేవలం ఏడాదిన్నర వ్యవధిలోనే అత్యున్నత ప్రమాణాలతో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పూర్తి చేయడం ద్వారా ఆయన మరో రికార్డు సృష్టించారు.

Also Read : ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్ ఏంటీ..? ఎయిర్పోర్ట్ లో ఎలా ఉపయోగం..?

ఉమ్మడి రాష్ట్రంలో 5 వేల ఎకరాల విస్తీర్ణంలో శంషాబాద్‌లో గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టును ప్రణాళిక చేసినదీ చంద్రబాబు నాయుడే. అంతటి భారీ విమానాశ్రయం అవసరమా అంటూ అప్పట్లో అనేక విమర్శలు వచ్చినప్పటికీ, వాటిని పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి, ఢిల్లీ నుంచి అనుమతులు తెచ్చి, నిధులు సమీకరించి, భూసేకరణ పూర్తిచేసి పనులు ప్రారంభించారు. తర్వాత ప్రభుత్వం మారినా, చంద్రబాబు రూపొందించిన ప్రణాళిక ప్రకారమే విమానాశ్రయం నిర్మాణం కొనసాగింది. ఫలితంగా పాతికేళ్ల తర్వాత కూడా ప్రయాణికుల సంఖ్య, విమానాల రద్దీ పెరిగినప్పటికీ హైదరాబాద్‌కు మరో విమానాశ్రయం అవసరం రాకుండా నిలిచింది. ఇది ఆయన ముందుచూపుకు నిదర్శనం.

మాజీ రాష్ట్రపతి, రాకెట్‌మ్యాన్ అబ్దుల్‌ కలాం చెప్పినట్లుగా “కల కనాలి.. దాన్ని సాధించాలి” అన్న సూత్రాన్ని ఆచరణలో పెట్టే నాయకుడు చంద్రబాబు నాయుడు. భవిష్యత్తు అవసరాలను ముందే అంచనా వేసి, దీర్ఘకాలిక విజన్‌తో ప్రణాళికలు రూపొందించి, వాటిని క్రమబద్ధంగా అమలు చేయడమే ఆయన నాయకత్వ శైలి. అందుకే విమర్శలు ఉన్నప్పటికీ, ఆయన పనితీరుకు ప్రజలతో పాటు రాజకీయ ప్రత్యర్థులు కూడా గుర్తింపు ఇస్తుంటారు.

Also Read : సోషల్ మీడియా వాడకపోతే ఆరోగ్యానికి ఇన్ని లాభాలా..?

విశాఖపట్నం భోగాపురంలో పూర్తయిన ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు, చంద్రబాబు నాయుడి విజన్‌, కృషి, పట్టుదలకు తాజా ఉదాహరణ. ఇది ఆయన ఖాతాలో రెండో గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం. ప్రస్తుత వేగాన్ని చూస్తుంటే, రాబోయే రోజుల్లో అమరావతిలోనూ, తదుపరి తిరుపతిలోనూ గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాల నిర్మాణం సాకారమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

జంతర్ మంతర్ నిరసనల్లో...

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్...

బీసీలకు ఏపీ సర్కార్...

ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన తరగతుల సామాజికవర్గాల భద్రత,...

కృష్ణా నదిని మింగేస్తున్నారా..?...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో కృష్ణానది...

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

పోల్స్