Wednesday, May 6, 2026 10:16 PM
Wednesday, May 6, 2026 10:16 PM

షమీకి బిగ్ షాక్..? ఎందుకింత కక్ష..?

సాధారణంగా భారత్ క్రికెట్ లో రాజకీయాలు జరుగుతూ ఉంటాయనే మాట మనం వింటూనే ఉంటాం. కొందరు ఆటగాళ్లను పదేపదే పక్కన పెట్టడం, సోషల్ మీడియాలో లేదంటే ఎలక్ట్రానిక్ మీడియాలో వాళ్ళను టార్గెట్ గా చేస్తూ విమర్శలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మహమ్మద్ షమీ విషయంలో అలాగే జరుగుతుంది అనే ఆందోళన అతని అభిమానుల్లో వ్యక్తమవుతోంది. మంచి ఫామ్ లో ఉన్నప్పటికీ అతనిని సెలెక్టర్లు పక్కన పెట్టడం పై మాజీ క్రికెటర్లు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఆస్ట్రేలియా పర్యటనప్పటి నుంచి కూడా అతనిని టీమిండియా యాజమాన్యం పక్కన పెడుతూనే వస్తోంది.

Also Read : గిల్ కు మరో షాక్ ఇవ్వనున్న సెలెక్టర్ లు..!

కొత్త బౌలర్లను జట్టులోకి తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రానా వంటి ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తున్నారు. కానీ షమీ విషయంలో మాత్రం పట్టించుకోవడం లేదు. షమీ ఫిట్నెస్ విషయంలో తనకు సమాచారం లేదని ఏకంగా చీఫ్ సెలెక్ట్ అజిత్ అగార్కర్ వ్యాఖ్యానించడంపై కూడా విమర్శలు వచ్చాయి. అయితే షమీ మాత్రం దేశవాళీ క్రికెట్లో అంచనాలకు మించి రాణిస్తున్నాడు. సయ్యద్ మస్తాక్ అలీ ట్రోఫీలో, రంజీలు, విజయ్ హజారే ట్రోఫీ లో అతను నిలకడగా రాణించడం చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ ఇటీవల సౌత్ ఆఫ్రికా తో టెస్ట్ సీరిస్ లో గాని వన్డే సిరీస్ లో గాని అతనిని ఎంపిక చేయలేదు.

Also Read : మధ్యలో ఆయనెందుకు వచ్చాడు మీకు..!

రాబోయే న్యూజిలాండ్ తో సిరీస్ విషయంలో కూడా అతనిని పక్కన పెట్టే అవకాశాలే కనపడుతున్నాయి. దానికి తోడు బోర్డు కాంట్రాక్ట్ నుంచి అతనిని పక్కన పెట్టే ఆలోచనలో కూడా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం గ్రేడ్ ఏ కాంట్రాక్ట్ లో ఉన్న షమీ ఐదు కోట్లు అందుకుంటున్నాడు. అయితే జాతీయ జట్టుకు ఎంపిక కాని కారణంగా అతనిని పక్కన పెట్టాలని బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అతని విషయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కక్ష సాధింపుగా వ్యవహరిస్తున్నాడు అనే విమర్శలు సైతం వినపడుతున్నాయి. విదేశాల్లో సీనియర్ బౌలర్లు రాణిస్తున్న సమయంలో.. షమీ లాంటి స్కిల్ ఉన్న బౌలర్ ను పక్కన పెట్టడం కరెక్ట్ కాదని క్రికెట్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్