Wednesday, August 5, 2026 12:55 PM
Wednesday, August 5, 2026 12:55 PM

ఇది కూడా సీబీఐకే..? రేవంత్ సంచలన నిర్ణయం..?

తెలంగాణలో ఫోన్ టాపింగ్ వ్యవహారం ఇప్పుడు మరోసారి సంచలనం అవుతోంది. ఈ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను విచారించే అవకాశం ఉన్న నేపథ్యంలో.. తర్వాతి పరిణామాలు ఏంటి అనే దానిపై పెద్ద చర్చ జరుగుతుంది. అయితే ఈ అంశానికి సంబంధించి రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందా అనే దానిపై ఇప్పుడు చర్చ మొదలైంది. కాలేశ్వరం వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి కేసును అప్పగించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ కేసు విషయంలో ఏం చేయబోతున్నారా అనేది కూడా ఉత్కంఠ రేపుతోంది.

Also Read : రేవంత్ రెడ్డి కాన్ఫిడెన్స్ కు మైండ్ బ్లాక్

దీనిని కూడా సిబిఐ కి అప్పగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ వ్యవహారంలో కీలక వ్యక్తులను విచారించిన దర్యాప్తు అధికారులు.. త్వరలోనే కెసిఆర్ తో పాటుగా కేటీఆర్, హరీష్ రావును కూడా విచారించే అవకాశం కనబడుతోంది. ఈ సమయంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కానున్నాయి. ఆ సమావేశాల్లోనే సిబిఐకి ఈ కేసుని అప్పగించే దిశగా రాష్ట్ర ప్రభుత్వ అడుగులు వేయవచ్చు. దీనికి ప్రధాన కారణం కేంద్ర మంత్రి బండి సంజయ్ సహా పలువురు బిజెపి నేతల ఫోన్లు కూడా టాప్ అయ్యాయి అనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి వారిని ఇప్పటికే అధికారులు విచారించారు.

Also Read : కేసీఆర్: ఉద్యమ నేత నుంచి ఒంటరి యోధుడి వరకు

అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుందనే ప్రచారం సైతం జరుగుతుంది. అందుకే కేసు నీ సిబిఐ చేతుల్లో, పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం. అటు కవిత భర్త ఫోన్ కూడా టాప్ అయిందనే ఆరోపణల నేపథ్యంలో.. ఆయనను కూడా విచారించే అవకాశం కనబడుతోంది. అలాగే బీజేపీకి సంబంధించి ఒక కీలక నేత, టిడిపికి సంబంధించి ఓ అగ్రనేత ఫోన్ కూడా టాప్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి కూడా ఇప్పుడు విచారణ వేగవంతం కానుంది. వారిని కూడా త్వరలోనే అధికారులు విచారించే అవకాశం ఉంది. ఈ సమయంలో కేసు గనుక సిబిఐ కి వెళితే మాత్రం ఖచ్చితంగా.. గులాబీ పార్టీ ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

పోల్స్