ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ కాలేజీల నిర్మాణం అంశానికి సంబంధించి కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో మెడికల్ కాలేజీలను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దీనికి సంబంధించి గత కొన్నాళ్లుగా వైసిపి తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వైసిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పదేపదే ఈ అంశాన్ని లేవనెత్తి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే దిశగా అడుగులు వేశారు. అయితే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ మాత్రం వెనక్కు తగ్గడం లేదని చెప్పాలి. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా క్లారిటీ ఇచ్చారు.
Also Read : బీఆర్ఎస్ బాడీ లాంగ్వేజ్ మారిందా..?
అయితే ఇప్పుడు కొంత ఈ మెడికల్ కాలేజీ లకు సంబంధించి కాంట్రాక్టర్లలో ఆందోళన మొదలైంది. దీనికి సంబంధించి వైసీపీ పదేపదే రాజకీయ విమర్శలు చేయడం, ఇటీవల జగన్ మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే మెడికల్ కాలేజీలు కట్టిన ప్రైవేటు వ్యక్తులపై కేసులు పెడతామంటూ వార్నింగ్ ఇవ్వటం జరిగాయి. దీనితో ఇప్పుడు కాంట్రాక్టర్లలో భయం మొదలైంది. జగన్ అధికారంలోకి వస్తే తమ పరిస్థితి ఏంటి అనే ఆందోళన కాంట్రాక్టర్లలో కనపడుతోంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అమర్ రాజా, లులు, కియా వంటి పరిశ్రమలను కూడా భయపెట్టిన పరిస్థితులు ఉండేవి. అప్పట్లో చాలా పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాలేదు.
Also Read : బెర్లిన్ లో రాహుల్ బాంబులు.. సంచలన ఆరోపణలు..!
దీనితో ఇప్పుడు కొన్ని కాలేజీలకు బిడ్ లు దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపుమేరకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. దీనితో ఆదోని, మార్కాపురం, పులివెందుల, మదనపల్లిలో కట్టాల్సిన మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రభుత్వం ముందుకు వెళ్లలేకపోతోంది. అయితే ఆధోని మెడికల్ కాలేజీకు చివరి నిమిషంలో బిడ్ దాఖలు అయింది. దీనితో మిగిలిన కాలేజీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం.. మరోసారి గడువును పొడిగించాలని భావిస్తోంది. అటు కాంట్రాక్టర్లలో ఉన్న భయాన్ని కూడా తొలగించే ప్రయత్నం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఆసక్తి ఉన్నవారు ఇప్పటికే తమను సంప్రదించాలని కూడా ప్రభుత్వ నుంచి కొంతమంది కాంట్రాక్టర్లకు సమాచారం వెళ్ళినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

