నెల్లూరు.. ఈ పేరు వినగానే పెన్నా నది, చేపల పులుసు, నెల్లూరు యాస, పెద్దారెడ్లు గుర్తుకు వచ్చేవారు గతంలో. అలాగే పచ్చని పైర్లు, సరదాగా ఉండే మనుషులు గుర్తుకు వచ్చేవారు. కానీ 2019 నుంచి 2024 వరకు ఎక్కువగా.. వినపడింది రౌడీలే. వైసీపీ పాలనలో నెల్లూరులో రౌడీలు రాజ్యం ఎలారని, గంజాయి, డ్రగ్స్, అక్రమ మద్యం, కబ్జాలు వంటివి ఎక్కువ అయిపోయాయని స్థానికులు పదేపదే ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒకప్పుడు హైదరాబాద్ లో మాత్రమే వినపడే కబ్జాలు.. నెల్లూరులో పెద్ద ఎత్తున జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Also Read : ఎమ్మెల్యేలకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్.. టార్గెట్ ఫిక్స్..?
గంజాయి అక్రమ రవాణా కోసం.. రాజకీయ నాయకులే రౌడీలకు సహకరిస్తున్నారని కామెంట్స్ సైతం వినిపించాయి. ఒక రకంగా నెల్లూరును మినీ బీహార్ గా మార్చేశారనేది అప్పట్లో ఉన్న ప్రధాన ఆరోపణ. స్నేహపూర్వక రాజకీయాలకు పెట్టింది పేరైన నెల్లూరులో.. కక్షపూరిత రాజకీయాలు కూడా మొదలయ్యాయి అప్పట్లో. ఇదే సమయంలో లేడీ డాన్ ల హవా కూడా మొదలైంది. కామాక్షి, అరుణ వంటి లేడీ డాన్ ల ప్రభావం నెల్లూరు పై తీవ్రంగా పడింది. అయితే ఇప్పుడు నెల్లూరులో పరిస్థితి మారుతోంది. ప్రభుత్వం మారిన తర్వాత శాంతిభద్రతల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పెద్దపీట వేయడంతో.. ఒక్కొక్కటి నెల్లూరులో సెట్ అవుతుంది.
రౌడీల రాజ్యమేలుతారు అనే పేరు ఉన్న నెల్లూరులో.. ఇప్పుడు శాంతి భద్రతలకు పోలీసులు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారు. రౌడీల మాట వినపడితే తొక్కిపెట్టి నారా తీస్తున్నారు. దీనితో నెల్లూరులో ఉన్న రౌడీ మూకలు ఇప్పుడు సరిహద్దుల్లో ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు వలస వెళ్లిపోయినట్లు నెల్లూరులో వార్తలు వస్తున్నాయి. స్థానికంగా కొన్న ఆస్తులను విక్రయించి, కబ్జా చేసిన భూముల్లో ఖాళీ చేసి.. నెల్లూరు ప్రజలకు ఇచ్చిన అప్పులను వదిలేసి.. తమ దారి తాము చూసుకుంటున్నారు. ఇటీవల కాలంలో పోలీసులు రౌడీల గురించి సమాచారం వస్తే.. వారిని అరెస్టు చేసి రోడ్లపై ఊరేగిస్తున్నారు.
Also Read : ఎమ్మెల్యేలకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్.. టార్గెట్ ఫిక్స్..?
సంఘ విద్రోహ కార్యక్రమాలకు పాల్పడితే ఎవరి మద్దతు ఉన్నప్పటికీ వదిలిపెట్టడం లేదు. ప్రభుత్వ వ్యవహారాల్లో, రాజకీయాల్లో, పోలీసు శాఖలో జోక్యం చేసుకుంటున్న కొందరి పేర్లను కూడా పోలీసులు గుర్తించారు. అక్రమంగా గత ఐదేళ్లపాటు ఆస్తులు కొన్న వారి జాబితా కూడా రెడీ చేశారు. రౌడీ అనే ముద్ర పడిన వాళ్లను.. ఎలాగైనా సరే అరెస్టు చేసి జైలుకు పంపిస్తున్నారు. సమయం కోసం ఎదురుచూస్తూ ఒక్కొక్కరిని గురిపెట్టి కొడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టడంతో.. డ్రామాలు ఆడిన రౌడీలు సైలెంట్ గా జారుకుంటున్నారు. అటు పోలీస్ శాఖలో సహకరించే వారిపై కూడా దృష్టి పెట్టారు జిల్లా ఎస్పీ. ఇటీవల పెంచలయ్య ఘటన తర్వాత మరింత ఫోకస్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం.

