Wednesday, August 5, 2026 08:55 PM
Wednesday, August 5, 2026 08:55 PM

బ్రేకింగ్: వివేకా కేసులో జగన్ నిర్దోషి..?

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి 2019 నుంచి ఇప్పటి వరకు దోషులు ఎవరు అనే దానిపై అనేక చర్చలు జరుగుతూనే ఉంటాయి. చేసింది ఎవరు, చేయించింది ఎవరు అనేది తెలిసినా సరే వారిపై చర్యలు తీసుకోవడం లేదని రాజకీయ పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నాయి. ఈ కేసు విచారణకు సంబంధించి మాజీ సిఎం.. వైఎస్ జగన్ పాత్రపై.. వివేకా కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. జగన్ నిందితులను కాపాడుతున్నారని విమర్శలు చేసారు.

Also Read : పవన్ సూపర్.. భయపడేది లేదు: చంద్రబాబు ఇంట్రస్టింగ్ కామెంట్స్

ఘటన జరిగిన రోజున పరిణామాలు, జగన్ మీడియా సమావేశం, జగన్ కు ఫోన్ చేసి చెప్పడం సహా అనేక అంశాలు విమర్శలకు వేదిక అయ్యాయి. ఇక ఈ కేసులో నిందితులు, సాక్షులు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోవడంపై కూడా అనేక అనుమానాలు వచ్చాయి. ఎంపీ అవినాష్ రెడ్డిపైనే వైఎస్ సునీత ఆరోపణలు చేసారు. అటు ఆయన తండ్రిని కూడా సిబిఐ అదుపులోకి తీసుకుంది. అయినప్పటికీ ఈ కేసులో అవినాష్ ను మాత్రం సిబిఐ అరెస్ట్ చేయలేదు. ఇక జగన్ విషయంలో కూడా సిబిఐ అధికారులు దూకుడుగా ముందుకు వెళ్ళలేదు.

Also Read : తెలుగు పులి కోసం.. ఇంటర్నేషనల్ వేటగాళ్లు రంగంలోకి..?

ఈ పరిస్థితుల్లో తాజాగా ఓ పరిణామం ఆసక్తిని రేపింది. వైఎస్ వివేకా కేసు ఆర్డర్ కాపీలో కీలక అంశాలు ప్రస్తావించింది సిబిఐ. జగన్, వివేకా మధ్య వివాదాలు ఉన్నాయనే సునీత న్యాయవాది వాదనకు ఆధారాలు లేవని సిబిఐ తెలిపింది. వివేకా చనిపోతే బంధువులకు విషయం తెలియజేయడం సహజం అని అభిప్రాయపడింది సిబిఐ. ఛార్జిషీట్‍లో కూడా జగన్ ప్రస్తావన లేదు.. హత్య జరిగిన రోజు ఉదయం జగన్‍కు ఫోన్ కాల్‍పై మరింత దర్యాపు అవసరం లేదని, హత్య జరిగిన రోజు కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డి మధ్య మెసేజ్‍లపైనే దర్యాపు చేయాలని సిబిఐ పేర్కొంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పార్లమెంట్ లో దుమ్మురేపిన...

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు బిల్లు-2026...

తెలంగాణలో డయల్ 100కు...

తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దాలుగా ప్రజల నాడిలో,...

జంతర్ మంతర్ నిరసనల్లో...

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్...

బీసీలకు ఏపీ సర్కార్...

ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన తరగతుల సామాజికవర్గాల భద్రత,...

కృష్ణా నదిని మింగేస్తున్నారా..?...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో కృష్ణానది...

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

పోల్స్