Wednesday, May 6, 2026 09:31 PM
Wednesday, May 6, 2026 09:31 PM

పేడ పురుగులతో జాగ్రత్త.. ఏపీ సర్కార్ వార్నింగ్

దేశంలో నిత్యం ఏదోక వైరస్ కలవరపెడుతూనే ఉంది. కరోనా తర్వాత పలు వైరస్ లు ప్రజలను కలవరానికి గురి చేస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో స్క్రబ్ వైరస్ కలకలం రేపుతోంది. మరణాలు కూడా నమోదు కావడంతో వైరస్ వస్తే ప్రాణాలు పోతాయనే భయం కూడా ప్రజల్లో నెలకొంది. దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోంది. దీనిపై కాసేపటి క్రితం వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేసారు. ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై కీలక వ్యాఖ్యలు చేసారు.

Also Read : దేఖ్‌లేంగే సాలా అంటున్న పవన్..!

కొన్ని రోజులుగా స్క్రబ్ టైఫస్ కేసులు నమోదు అవుతున్నాయని, ఈ ఏడాది 1566 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదు అయినట్లు తెలిపారు. స్క్రబ్ టైఫస్ బ్యాక్టీరియా ఏటా శీతాకాలంలో వస్తుందని తెలిపారు. ఏటా కేసులు నమోదు అవుతాయని, ప్రాణాంతకం కాదని పేర్కొన్నారు. ఆందోళన అవసరం లేదని, అంతర్జాతీయ నిపుణులతో చర్చించామని, త్వరగా గుర్తిస్తే మందులున్నాయన్నారు. బ్యాక్టీరియా వల్లే మరణాలనడానికి లేదని, మరణాలకు పలు కారణాలు ఉన్నట్టుగా పేర్కొన్నారు.

Also Read : ఆ యంగ్ స్పీడ్ గన్ ఎక్కడ..? గంభీర్ మర్చిపోయాడా..?

ప్రతి గ్రామంలో స్క్రబ్ టైఫస్ కేసులు ఉంటాయని, పేడ పురుగుల నుంచి స్క్రబ్ టైఫస్ వస్తుందన్నారు. 9 అనుమానిత మరణాలు నమోదైనట్లు గుర్తించామని, ల్యాబ్‌ల్లోనూ పరీక్షలకు అన్ని సదుపాయాలు కల్పించామన్నారు. జ్వరం వస్తే వైద్యుడి వద్దకు వెళ్లి రక్త నమూనాలు ఇవ్వాలని సూచించారు. ఐదు నుంచి 20 రోజుల మధ్య వ్యాధి గురించి తెలుస్తుందని, వైద్యులు సూచించిన యాంటీబయాటిక్స్ వాడాలని హెచ్చరించారు. జీనం ల్యాబ్స్‌లో మరణాల విశ్లేషణ చేయిస్తున్నామన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్