Saturday, September 19, 2026 07:13 PM
Saturday, September 19, 2026 07:13 PM

షాకింగ్: ఐపిఎల్ కు స్టార్ ఆటగాడు గుడ్ బై..!

ఐపిఎల్ వేలం పాట అనగానే క్రికెట్ అభిమానుల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. మెగా వేలం అయినా మినీ వేలం అయినా సరే.. ఆటగాళ్ళు తమ అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు ఎదురు చూస్తూ ఉంటారు. జట్లు వదులుకున్న ఆటగాళ్లను.. ఎవరు కొంటారు.. కొత్త ఆటగాళ్ళు ఎవరు అడుగు పెడతారు అనే దానిపై క్రికెట్ అభిమానుల్లో ఓ రకమైన ఉత్కంట నెలకొంది. ఇటీవల ఆటగాళ్ళ ట్రేడింగ్ కు సంబంధించి ఓ క్లారిటీ వచ్చింది. కొందరు కీలక ఆటగాళ్ళు జట్లు మారుతోన్న సంగతి తెలిసిందే.

Also Read : షాకింగ్: పాక్ విషయంలో భారత్ వెనక్కు తగ్గిందా..?

అయితే ఈ సారి వేలం లో ఓ కీలక ఆటగాడు పాల్గొనే అవకాశం కనపడటం లేదు. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ తాను మినీ – వేలంలో పాల్గొనడం లేదని క్లారిటీ ఇచ్చాడు. మంగళవారం దీనికి సంబంధించి స్పష్టత ఇచ్చేసాడు. తాను ఐపీఎల్ 2026 మినీ-వేలానికి దూరంగా ఉంటున్నట్లు తెలిపాడు. డిసెంబర్ 16న అబుదాబిలో జరగనున్న మినీ-వేలం నుండి ఆండ్రీ రస్సెల్, ఫాఫ్ డుప్లెసిస్ వైదొలిగిన అనంతరం.. 37 ఏళ్ళ మ్యాక్స్వేల్ కూడా తప్పుకున్నాడు. ఒకానొక సమయంలో అత్యధిక ధర పలికిన ఆటగాడు.

Also Read : పుతిన్ ఫస్ట్ ట్రంప్ నెక్స్ట్.. రష్యాతో భారత్ కీలక ఒప్పందం..?

ఇతన్ని మెంటార్ గా భారీ ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఐపిఎల్ విషయానికి వస్తే మ్యాక్స్వేల్ అంచనాలకు మించి రాణించడం లేదనే విమర్శలు వినిపించాయి. స్టార్ ఆటగాడిగా గుర్తింపు ఉన్న ఈ ఆటగాడు.. పంజాబ్, బెంగళూరు సహా పలు జట్లకు ఆడినప్పటికీ.. పేలవ ప్రదర్శన కారణంగా దూరమయ్యాడు. జట్లు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా అతను ఆదుకోలేదు. అటు బౌలింగ్ పరంగా కూడా అతను రాణించడం లేదనే విమర్శలు సైతం ఉన్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

పోల్స్