Sunday, March 22, 2026 12:49 PM
Sunday, March 22, 2026 12:49 PM

మహిళల చేత మారణహోమం.. ఎర్రకోట బ్లాస్ట్ లో సంచలన విషయాలు

ఎర్ర కోట సమీపంలో నవంబర్ 10న జరిగిన పేలుడు కేసులో అరెస్టయిన అల్-ఫలాహ్ యూనివర్సిటీ మాజీ ఫార్మకాలజిస్ట్ డాక్టర్ షాహీన్ సయీద్ పాత్రపై NIA కీలక విషయాలను బయటపెట్టింది. జైష్-ఏ-మొహమ్మద్ (JeM) కోసం ప్రత్యేకంగా మహిళలను రిక్రూట్ చేసి ఉగ్ర కార్యక్రమాల్లో పాలుపంచుకునేలా చేయాలని షాహీన్ ప్రణాళిక చేసిందని దర్యాప్తులో తేలింది. ఆమెను JeM యొక్క మహిళా విభాగానికి కీలక నేతగా ఉపయోగించాలన్న మాడ్యూల్ ఉద్దేశం కూడా బయటపడింది. ఉగ్రవాద కార్యకలాపాలకి మహిళలనే రిక్రూట్ చేసుకునే పనిలో నిమగ్నం అయినట్లు ఆమె బయటపెట్టిందని సమాచారం.

Also Read : మళ్లీ భూ సేకరణ.. ఈసారి ఎన్ని ఎకరాలంటే..?

విచారణ అధికారులు ఆమె హాస్టల్ గదిని శోధించగా, ₹18.5 లక్షల నగదు, బంగారు బిస్కెట్లు, విదేశీ కరెన్సీ వంటి పెద్ద మొత్తంలో ఆస్తులు దొరికాయి. విద్యాసంస్థ క్యాంపస్‌లో ఇంత భారీ మొత్తంలో నగదు మరియు బంగారం లభించడంతో ఆమె నెట్వర్క్ ఎంత విస్తృతంగా, ప్రణాళికాబద్ధంగా పనిచేసిందో స్పష్టమవుతోంది. దీనితో ఆమె పాత్ర కేవలం సహకారం మాత్రమే కాకుండా, కీలక సమన్వయకర్తగా కూడా ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈమె గతంలో 2014 – 2018 మధ్య సమయంలో సౌది అరేబియాలోని ఒక కాలేజీలో ప్రొఫెసర్ కూడా పనిచేసినట్లు అధికారులు గుర్తించారు.

ఈ బ్లాస్ట్‌ను అధికారులు ఒక పెద్ద కుట్రలో భాగంగా చూస్తున్నారు. నవంబర్ 10 ఘటన “ఆపరేషన్ D-6” పేరిట డిసెంబర్ 6న ప్లాన్ చేసిన భారీ దాడికి ముందు జరిగింది అనే అనుమానాలు ఉన్నాయి. వైద్యులు, యువత, విద్యార్థులు పాల్గొన్నట్లు తెలిసిన ఈ వైట్-కాలర్ టెరర్ మాడ్యూల్ దేశవ్యాప్తంగా అనేక ప్రదేశాలకు విస్తరించి ఉండే అవకాశం ఉందని విచారణలో బయటపడుతోంది. కాలేజి నుంచి వారి బృందం పేలుడు పదార్ధాల తయారీకి వినియోగించిన కెమికల్స్ కొన్న షాప్ కి కూడా తీసుకెళ్ళి దాని పై వివరాలు సేకరించినట్లు తెలుస్తుంది.

Also Read : తీరం దాటిన కర్ణాటక రాజకీయ తుఫాన్

ప్రస్తుతం NIA విచారణను వేగవంతం చేస్తోంది. డాక్టర్ షాహీన్‌తో పాటు మిగతా నిందితులు న్యాయ కస్టడీలో ఉన్నారు. ఫోన్ కాల్ రికార్డులు, డిజిటల్ డేటా, ఫండింగ్ సోర్స్‌లు, విదేశీ లింకులు వంటి అంశాలపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. అధికారులు ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరగవచ్చని తెలుస్తుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్