Wednesday, February 4, 2026 04:04 PM
Wednesday, February 4, 2026 04:04 PM

ప్రక్షాళన దిశగా వైసీపీ.. టార్గెట్ ఫిక్స్..!

30 ఏళ్లు మనదే అధికారం అని గొప్పగా చెప్పారు. కానీ సరిగ్గా ఐదేళ్లకే ఓడిపోయారు. చివరికి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి. దాదాపు 5 నెలల తర్వాత మళ్లీ ఏపీలోకి వచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. పార్టీని తిరిగి గాడిలో పెట్టేందుకు సిద్ధమయ్యారు. తొలి రోజుల్లో కేవలం పరామర్శ యాత్రలకే పరిమితమయ్యారు. అయితే ఆ సమయంలో రప్పా రప్పా డైలాగ్‌లతో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. సత్తెనపల్లి యాత్ర సమయంలో జగన్ వాహనం కింద పడి ఓ వ్యక్తి చనిపోయారు. దీంతో వైసీపీ పైన మరింత వ్యతిరేకత వచ్చింది. ఇదే సమయంలో పార్టీ ఎలా గెలుస్తుందో చూస్తామంటూ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చెప్పడంతో వైసీపీ నేతల్లో భయం మొదలైంది. దీంతో రంగంలోకి దిగిన పార్టీ పెద్దలు తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Also Read : ఫోన్ కోసం కక్కుర్తి.. కల్తీ నెయ్యిలో సంచలన విషయాలు

వైసీపీ పెద్దలు కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. ముందుగా పార్టీలో ఉండి కూటమికి నేరుగా లేదా పరోక్షంగా మద్దతు చేసే నేతలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ అటువంటి వారికి ప్రాధాన్యత ఇవ్వొద్దని ఇంచార్జ్ లకు సూచించారు. పార్టీ కష్ట కాలంలో మౌనంగా ఉన్న నేతలను కూడా గుర్తించాలని.. సూచించారు. అధికారం ఉంటే వచ్చి నాయకత్వం చేయటం కాదు.. అధికారంలో లేనప్పుడు పార్టీ శ్రేయస్సు కోరి పార్టీకి బలం ఇచ్చే వారే నిజమైన నాయకులని గుర్తించాలని సూచించారు.

అలాగే హోదా కోసం పదవులు తీసుకొని సైలెంట్‌గా ఉన్నవారిని గుర్తించాలని.. ఏ హోదా లేకున్నా పార్టీ కోసం శ్రమించే వారికి మంచి స్థానం కల్పించాలని పార్టీ ఆదేశాలు జారీ చేసింది. కూటమిలో చేరిన వైసీపీ నాయకులకు మళ్ళీ వస్తాను అని చెప్పినా నో ఎంట్రీ బోర్డు పెట్టాలని స్పష్టం చేసింది. అటువంటి వారిని ప్రమాద కారులుగా గుర్తించాలని సూచించింది. అన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి ఏ రోజు డేటా ఆ రోజు సెంట్రల్ ఆఫీ‌స్‌కు చేరుతుందని.. గతంలో ఐ ప్యాక్‌ను నమ్ముకొని మోస పోయామని సూచించింది. ఇప్పుడు అంతా పార్టీ కేడర్ నే నిఘా వర్గాల పరిశీలన చేస్తుందనే విషయాన్ని గమనించాలని హెచ్చరించింది. పార్టీ కోసం శ్రమించే నేతలకు కానీ.. కార్యకర్తలకు కానీ ఈ సారి పెద్దపీట వేస్తున్నారు.

Also Read : అమెరికాలో గన్ కల్చర్ ఎప్పుడు మొదలైంది..? అమెరికా చట్టాలు ఏం చెప్తున్నాయి..?

రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని.. ఈసారి వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమన్నారు. కార్యకర్తలకు మంచి హోదా, మంచి స్థానం కల్పించే దిశగానే చర్యలుంటాయన్నారు. ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిని నియంత్రించాలని.. గట్టిగా నిలదీసి.. వైసీపీ గెలుపు సాధ్యం చేయాలని ఆదేశించారు. జగనన్న 2.0లో ప్రజలకు, పార్టీ శ్రేణులకు మంచి రోజులు వస్తున్నాయంటూ తాజాగా జరిగిన ఇంఛార్జుల సమావేశంలో పార్టీ పెద్దలు స్పష్టం చేశారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్