ఆపరేషన్ కగార్ తో వరుస ఎదురు దెబ్బలు తింటున్న మావోయిస్ట్ పార్టీ.. తాజాగా సంచలన లేఖ రాసింది. మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-చత్తీస్‌గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ (ఎంఎంసి జోన్) ప్రతినిధి అనంత్.. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. దేశంలో మరియు ప్రపంచంలో మారుతున్న పరిస్థితులను అంచనా వేసిన తర్వాత, ఆయుధాలను త్యజించడం ద్వారా సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని మా పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మరియు పొలిట్‌బ్యూరో సభ్యుడు కామ్రేడ్ సోను దాదా ఇటీవల తీసుకున్న నిర్ణయానికి మేము మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. ఇటీవల కేంద్ర కమిటీ సభ్యులు సరెండర్ అవుతూ వచ్చారని ఇది పార్టీకి కోలుకోలేని దెబ్బ అంటూ పేర్కొన్నారు.
Also Read : హిడ్మాకు సోషల్ మీడియాలో షాకింగ్ క్రేజ్.. వైరల్ అవుతోన్న తల్లి దీన స్థితి..!
తమ స్పెషల్ జోనల్ కమిటీ కూడా ఆయుధాలను విడిచిపెట్టి, ప్రభుత్వ పునరావాసం మరియు నూతన మార్గం ప్రణాళికను అంగీకరించాలనుకుంటున్నామని ప్రకటించారు. అయితే, మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు మాకు సమయం ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నామనీ కోరారు. తమ పార్టీ ప్రజాస్వామ్య కేంద్రీకరణ సూత్రాలకు కట్టుబడి ఉన్నందున, తాము సమిష్టిగా ఈ నిర్ణయానికి రావడానికి కొంత సమయం పడుతుందని, మా సహచరులను సంప్రదించి, మా పద్దతి ప్రకారం వారికి ఈ సందేశాన్ని తెలియజేయడానికి మాకు సమయం కావాలని , కాబట్టి, మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు ఫిబ్రవరి 15, 2026 15, 2026 వరకు మాకు సమయం ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నామని లేఖలో కోరారు. తమను నమ్మాలని నమ్మండి, ఇంత సమయం అడగడం వెనుక ఎటువంటి నిగూఢ ఉద్దేశ్యం లేదని పేర్కొన్నారు.
Also Read : జాదూ రవి.. ఆ డేటా ఏం చేశాడు..? షాక్ అవుతున్న పోలీసులు..!
ఒకరితో ఒకరు త్వరగా సంభాషించడానికి మాకు వేరే సులభమైన మార్గాలు లేవని, కాబట్టి ఇది చాలా సమయం పడుతుందన్నారు. ఇది కొంచెం ఎక్కువ అని మాకు తెలుసు, కానీ ఇది మావోయిజాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వం విధించిన గడువులోపు (మార్చి 31, 2026) ఉందన్నారు. అప్పటి వరకు, మూడు రాష్ట్ర ప్రభుత్వాలు కొంత సంయమనం పాటించాలని మరియు వారి భద్రతా దళాల కార్యకలాపాలను నిలిపివేయాలని మేము కోరుతున్నామని విజ్ఞప్తి చేశారు.. రాబోయే పీఎల్జీయే వారంలో వారు ఎటువంటి కార్యకలాపాలను కూడా నిర్వహించకూడదని మావోయిస్ట్ పార్టీ కోరింది. వారోత్సవాన్ని జరుపుకోబోమని మరియు మా అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తామని కూడా మేము మీకు హామీ ఇస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. లొంగిపోయిన ఆశన్న, మల్లోజుల ఈ విజ్ఞప్తిని ప్రభుత్వం దృష్టిలో పెట్టాలని కోరారు.

