Wednesday, February 4, 2026 10:58 PM
Wednesday, February 4, 2026 10:58 PM

జూబ్లిహిల్స్ లో టీడీపీ క్యాడర్ ఏం చేసింది..?

జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో విజయం కోసం సిఎం రేవంత్ రెడ్డి సహా.. కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడం, కీలక నాయకత్వం క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేయడం, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కు ధీటుగా ప్రచారం చేయడం చూస్తూ వచ్చాం. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ సోషల్ మీడియా కూడా కీలక పాత్ర పోషించిందనే అభిప్రాయాలు వెల్లడి అవుతున్నాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఎదుర్కొనే విషయంలో టీడీపీ సానుభూతిపరులు కీలక పాత్ర పోషించినట్లు చెప్తున్నారు.

Also Read : రేవంత్ ను తక్కువ అంచనా వేశారా..?

2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు టీడీపీ సోషల్ మీడియా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తూ వచ్చింది. బీఆర్ఎస్ పై ఉన్న కోపం, రేవంత్ రెడ్డిపై ఉన్న అభిమానంతో కాంగ్రెస్ తరుపున పెద్ద ఎత్తున పని చేసారు. ఇక ఇప్పుడు కూడా అదే స్థాయిలో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పని చేసారు. అలాగే టీడీపీని అభిమానించే సేటిలర్ లు సైతం కాంగ్రెస్ కు అండగా నిలబడ్డారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ చేసిన వ్యాఖ్యలకు టీడీపీ సోషల్ మీడియా ఘాటు కౌంటర్ ఇచ్చింది.

Also Read : పరిటాల నుంచి పరకామణి వరకు.. కీలక నిందితులు మరణాలు..!

రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా కూడా టీడీపీ సానుభూతి పరులు ప్రచారం చేసారు. గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్ లు, సేటిలర్ లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా టీడీపీ సానుభూతిపరులు కాంగ్రెస్ కు అనుకూలంగా పని చేసారనే మాట వినపడుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పై ఉండే కోపంతోనే ఈ పని చేసినట్టు చెప్తున్నారు. అటు సిఎం రేవంత్ రెడ్డి కూడా టీడీపీ సానుభూతిపరుల ఓట్లపై గురి పెట్టి ప్రచారం నిర్వహించారు. అమీర్పేట్ లో ఎన్టీఆర్ విగ్రహం వంటి అంశాలు కాస్త కలిసి వచ్చాయనే చెప్పాలి. అటు టీడీపీ పోటీ పెట్టకపోవడం కూడా ఒకరకంగా కాంగ్రెస్ కు కలిసి వచ్చిన అంశంగా చెప్పాలి. ఇదే సమయంలో బిజెపి బలమైన అభ్యర్ధిని పోటీలో పెట్టడంలో విఫలం కావడం కూడా టీడీపీ, జనసేన కాంగ్రెస్ కు పని చేసి ఉండవచ్చనే కామెంట్స్ వస్తున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్