Wednesday, February 4, 2026 03:50 PM
Wednesday, February 4, 2026 03:50 PM

జగన్ చుట్టూ ఏం జరుగుతోంది..? రౌండప్ అవుతున్నారా..? భూకంపం సృష్టిస్తున్న అత్యంత సన్నిహితులు..!

ప్రజాస్వామ్య వ్యవస్థలో కాలం ఎలా ఉంటుందో అంచనా వేయడం చాలా కష్టం. మనం మాట్లాడే మాట, మనం తీసుకునే నిర్ణయం, మనం ప్రవర్తించే విధానం, మన ఆలోచన సరళి, భవిష్యత్తుపై మనకున్న ప్రణాళిక.. ఇవన్నీ అత్యంత కీలక అంశాలు. అధికారం అనేది శాశ్వతం కాదు. అది హిట్లర్ అయినా.. లేకపోతే 2024 లో ఓడిపోయిన వైయస్ జగన్మోహన్ రెడ్డి అయిన.. కాలం ముందు తలవంచాల్సిందే. తలవంచని హిట్లర్ చరిత్రలో హీనుడిగా మిగిలిపోయారు. తల ఎగరేసిన జగన్ అత్యంత ఘోర పతనాన్ని చూశారు.

Also Read : లోకేష్‌ బాటలో జగన్.. వర్కవుట్ అవుతుందా..?

తనను ఎవరూ ఏమీ పీకలేరు అనే స్టేజ్ నుంచి.. మీ బిడ్డగా నన్ను మీరే రక్షించుకోవాలి అనే స్టేజ్ వరకు జగన్ 2019 నుంచి 2024 మధ్యకాలంలో దిగిపోయారు. ఈ ఐదేళ్ల కాలంలో జగన్ తీసుకున్న నిర్ణయాలు, అమలు చేయించిన పద్ధతులు ఎంతో సంచలనం. అన్ని వర్గాలను ఎంతగానో ఇబ్బంది పెట్టిన జగన్.. ఇప్పుడు అన్ని వైపుల నుంచి ఇబ్బంది పడుతున్నారు అనే అభిప్రాయం బలంగా వినపడుతోంది. తాను అత్యంత సన్నిహితంగా భావించిన ఎందరో వ్యక్తులు.. ఇప్పుడు ఏం చేస్తారో అర్థం కాక సతమతమవుతున్నారు బ్లూ పార్టీ అధినేత. అసలు జగన్ చుట్టూ కనపడకుండా ఏం జరుగుతుందో ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం.

లిక్కర్ కుంభకోణాన్ని అత్యంత తక్కువగా అంచనా వేశారు జగన్. కానీ అత్యంత సన్నిహితులుగా చెప్పుకునే మాజీ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైయస్ జగన్ సతీమణి వైయస్ భారతి వ్యాపార వ్యవహారాలు చూసే బాలాజీ గోవిందప్ప.. వంటి ఎందరో కీలక వ్యక్తులు అరెస్టయ్యారు.. వీరందరూ జగన్ తో అత్యంత సన్నిహితంగా మెలిగే వ్యక్తులు. రాజకీయాలతో సంబంధం లేకుండా జగన్ వెంట నిలబడింది కూడా వీళ్లే. 2004 నుంచి 2009 రాజశేఖర్ రెడ్డి మరణం వరకు.. జగన్ ఆధిపత్యం కొనసాగడంలో ధనుంజయ రెడ్డి పాత్ర ఎంతో ఉంది. ఆయనను ఐఏఎస్ అధికారి చేసిందే వైఎస్ కుటుంబం.

Also Read : వైవీ సుబ్బారెడ్డి అరెస్ట్..? ఆయన్ను కూడా..?

2010 తర్వాత జగన్ స్థాపించిన వైసీపీలో.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర ఎంతో కీలకం. సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో వైసిపి ఒకానొక సమయంలో ఆధిపత్యం చలాయించడానికి.. అత్యంత కీలకపాత్ర పోషించింది పెద్దిరెడ్డి కుటుంబం అలాంటి వ్యక్తులు అరెస్ట్ కావడం జగన్ వ్యక్తిగత జీవితంపై కూడా కొంత ప్రభావం చూపించిందనే మాట సైతం వినపడింది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన కొంతకాలానికి బెయిల్ పై బయటకు వచ్చారు. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రం బెయిల్ పై బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి కూడా జైలుకు వెళ్లే పరిస్థితులు కూడా ఉన్నాయి.

Also Read : కాశ్మీర్ లో తెలుగోడి సత్తా.. ఉగ్రవాదులకు చుక్కలు చూపిస్తున్న ఆఫీసర్..!

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎలాగైనా బయటకు తీసుకురావాలని జగన్ చేస్తున్న ఒక్క ప్రయత్నం కూడా సఫలీకృతం కావడం లేదు. లాయర్లను మార్చినా, పిటిషన్ల మీద పిటిషన్లు వేసిన సరే చెవిరెడ్డి మాత్రం జైల్లోనే ఉంటున్నారు. మిథున్ రెడ్డి బయటకు రావడం కంటే చెవిరెడ్డి బయటకు రావడమే జగన్ కు అత్యంత కీలకమని వైసిపి వర్గాల్లో కూడా చర్చ వినపడుతూ ఉంటుంది. ఇక వీటికి తోడు కల్తీ నెయ్యి వ్యవహారంలో టిటిడి మాజీ ఈవో ధర్మారెడ్డి అప్రూవర్ గా మారినట్లు వార్తలు వచ్చాయి. వైసీపీ ప్రభుత్వం లో ధర్మారెడ్డి కూడా అత్యంత కీలక పాత్ర పోషించారు. ఇక ఇదే సమయంలో వై వి సుబ్బారెడ్డి పిఎ చిన్న అప్పన్న కూడా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.

Also Read : వైసీపీలో కలకలం.. అప్రూవర్‌గా ధర్మారెడ్డి..!

ఆయన అరెస్ట్ అయిన తర్వాత కల్తీ నెయ్యి వ్యవహారంలో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇక వైవి సుబ్బారెడ్డిని కూడా అరెస్టు చేసే అవకాశం కూడా కనబడుతోంది. ఇక తాజాగా జగన్ తలలో నాలుకల వ్యవహరించిన.. మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ కూడా జగన్ కు ఓ రకంగా వ్యతిరేకంగానే మాట్లాడారు. గతంలో జగన్ వ్యక్తిగత, రాజకీయ, ఆర్థిక జీవితంపై ఎంతో ప్రభావం చూపించిన విజయసాయిరెడ్డి కూడా జగన్కు దూరమయ్యారు. ఇలా జగన్ నమ్మిన వాళ్లు, జగన్ ను నమ్ముకున్న వాళ్లు.. ఒక్కొక్కరు దూరం కావడమే కాకుండా సంచలన విషయాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఇక వై వి సుబ్బారెడ్డి అరెస్ట్ అయితే.. ఆయన ఏదైనా బయట పెడతారా అనే ఆందోళన కూడా వైసీపీ అధిష్టానం లో ఉన్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల నేపథ్యంలో రాజకీయం చేయడం కంటే తన్నుతాను కాపాడుకోవడమే జగన్ కు అత్యంత కీలకంగా మారిన అంశం అనేది స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నాయి రాజకీయ వర్గాలు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్