Wednesday, February 4, 2026 08:51 PM
Wednesday, February 4, 2026 08:51 PM

కల్తీ నెయ్యి నిజమే.. రసాయనాలతో నెయ్యి తయారీ..!

తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టిటిడి మాజీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి పిఎ అప్పన్న అరెస్ట్ అయిన తర్వాత విచారణలో కీలక అంశాలను అధికారులు గుర్తిస్తున్నారు. కల్తీ నెయ్యి కేసులో అరెస్టు అయిన అజయ్ కుమార్ రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు తాజాగా ప్రస్తావించారు అధికారులు. రకరకాల రసాయనాలను భోలే బాబా కంపెనీకి అజయ్ కుమార్ సుగంద్ విక్రయించినట్లు గుర్తించారు. కోట్ల రూపాయల విలువైన రసాయనాలను సరఫరా చేసి ఆదాయం పొందినట్లు తేల్చారు.

Also Read : తెలంగాణాలో భారీ పెట్టుబడి ప్లాన్.. చివరకు ఏపీకి.. అసలేం జరిగింది..?

2020 నుంచి 2024 వరకు భోలే బాబాకు సరఫరా చేసినట్లు తేల్చారు. అజయ్ సరఫరా చేసిన రకరకాల రసాయనాలతో నెయ్యి తయారు చేసినట్లు గుర్తించారు. ఆ నెయ్యిని ట్యాంకర్ల ద్వారా తిరుమలకు లడ్డు తయారీ కోసం తరలించినట్లు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. అజయ్ కుమార్ కూడా ఈ కుట్రలో కీలక పాత్ర పోషించినట్లు వెల్లడయింది. ఇక ఈ కేసులో మొత్తం 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కల్తీ నెయ్యి కేసులో మొత్తం 27 మందిని నిందితులుగా చేర్చింది సిట్. నిందితుల అరెస్టు తర్వాత పోలీస్ కస్టడీ విచారణలో కీలక అంశాలు బయటపడ్డాయి.

Also Read : నా బరువుతో నీకేం పని.. నటి సీరియస్..!

కీలక అంశాలు ఆధారంగా మరో 9 మందిని నిందితులుగా చేర్చారు. ఇప్పుడు వీరందరినీ అరెస్టు చేసేందుకు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. తొలిసారి బోలె బాబా డైరీ డైరెక్టర్లు పోమిల్ జాయిన్, విపిల్ జైన్ సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. రెండో విడతలో వైష్ణవి డైరీ సీఈవో అపూర్వ చావ్లా తో పాటుగా మరో నిందితుడు అరెస్ట్ అయ్యాడు. విడతల వారీగా సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్నతో పాటుగా మరో ముగ్గురిని అరెస్టు చేశారు. త్వరలోనే మరో కీలక వ్యక్తిని కూడా అరెస్టు చేసే అవకాశం కనబడుతోంది. ఏది ఎలా ఉన్నాయి ఈ వ్యవహారాన్ని మాత్రం దర్యాప్తు బృందం సీరియస్ గా పరిగణించటంతో ఏ పరిణామాలు ఉంటాయా అనేది ఆసక్తిని పెంచుతుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్