Wednesday, February 4, 2026 09:20 PM
Wednesday, February 4, 2026 09:20 PM

కరీంనగర్ వాసులకు బండి బంపర్ ఆఫర్..!

బండి సంజయ్.. ఈ పేరు తెలంగాణలో చాలా రోజుల పాటు గుర్తు ఉంటుంది. తెలంగాణలో ఒకటి, రెండు స్థానాలకే పరిమితమైన భారతీయ జనతా పార్టీ 8 అసెంబ్లీ స్థానాలు గెలిచిందంటే.. అందుకు బండి కృషి మాత్రమే కారణమనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో ఢీ అంటే ఢీ అనేలా కొట్లాడి.. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ దాదాపు గెలిచినంత పని చేసిందంటే.. దాని వెనుక బండి సంజయ్ ఉన్నారనేది బహిరంగ రహస్యం. హిందుత్వ అజెండాతో పాటు అన్ని వర్గాల ప్రజలను కలుపుకుంటూ ముందుకు వెళ్లిన బండి సంజయ్.. 2023 అసెంబ్లీ ఎన్నికల నాటికి కమలం పార్టీకి బలమైన క్యాడర్ వచ్చేలా తన వంతు కృషి చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వంటి సీనియర్ నేతలను పదేపదే హైదరాబాద్ రప్పించగలిగారు. తెలంగాణలో విస్తృత పర్యటనలకు బండి కృషి ఎంతో ఉంది. తాజాగా బండి సంజయ్ చేసిన ప్రకటన.. ప్రతిపక్ష నేతల్లో గుబులు రేపుతోంది.

Also Read : క్యాబినెట్‌ నుంచి ఆ ముగ్గురు అవుట్..!

బీజేపీ కార్పొరేటర్‌గా వరుసగా 3 సార్లు గెలిచిన బండి సంజయ్. తొలిసారి 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2019లో కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన బండి.. టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్‌పై 89 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక 2020 – 2023 మధ్య కాలంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా పని చేసిన కాలంలో కమలం పార్టీ అంటే అధికార టీఆర్ఎస్ నేతలు భయపడేలా చేశారు. ఒకదశలో తెలంగాణ బీజేపీ సీఎం అభ్యర్థిగా బండి సంజయ్ పేరు బాగా వినిపించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసి ఓడిన సంజయ్.. ఆ తర్వాత 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 2 లక్షల 25 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నాటి నుంచి తన మార్కు రాజకీయంతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేస్తున్నారు బండి సంజయ్. ఓ వైపు కేంద్ర మంత్రిగా కొనసాగుతూనే.. నియోజకవర్గంలో ఏ చిన్న సమస్య వచ్చిన సరే.. స్వయంగా స్పందిస్తున్నారు.

Also Read : లోకేష్ మార్క్.. ఎమ్మెల్యేకి స్ట్రాంగ్ వార్నింగ్..?

తాజాగా బండి సంజయ్ కీలక ప్రకటన చేశారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు మోదీ కానుక అని ప్రకటించారు. తన పార్లమెంట్ పరిధిలోని 12,292 మంది పదవ తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజు మొత్తం తానే చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు బండి ప్రకటించారు. కరీంనగర్ జిల్లాలో 4,847 మంది, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 4,059 మంది, జగిత్యాల జిల్లాలో 1,135 మంది, సిద్దిపేట జిల్లాలో 1,118 మంది, హనుమకొండ జిల్లా పరిధిలో 1,133 మంది విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు. మోదీ గిఫ్ట్ పేరుతో విద్యార్థులకు ఫీజు చెల్లిస్తున్నట్లు ప్రకటించారు. డబ్బు ఇబ్బందుల వల్ల ఏ ఒక్క విద్యార్థి పరీక్షలకు గైర్హాజరు అవ్వకూడదన్నారు. చదువు అనేది ప్రతి ఒక్కరికీ గౌరవాన్ని ఇస్తుందన్నారు. వచ్చే ఏడాది విద్యార్థులకు మరో 20 వేల సైకిళ్లు ఇవ్వానున్నట్లు కూడా ప్రకటించారు. అలాగే ప్రధాని మోదీ పేరుతో పుస్తకాలు, బ్యాగులు, ఇతర స్టేషనరీ కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ప్రతి విద్యార్థికి అండగా బండి సంజయ్ ఉంటారని హామీ ఇచ్చారు.

Also Read : జగన్ నిర్ణయం వెనుక ఆంతర్యం ఏమిటో..?

బండి సంజయ్ చేసిన ప్రకటన పట్ల కరీంనగర్ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బండి ప్రకటను స్వాగతించిన పలువురు.. ఇంటర్ విద్యార్థుల గురించి ఆలోచించాలని సూచిస్తున్నారు. మరికొందరు ఈ ప్రకటన వెనుక రాజకీయ కోణం ఉందంటున్నారు. యువ ఓటర్లకు బండి సంజయ్ ఇప్పటి నుంచే తన వైపు తిప్పుకుంటున్నారని.. రాజకీయ ఎత్తుగడలో ఇదే భాగం అంటున్నారు. ప్రతి విద్యార్థికి 125 రూపాయల చొప్పున మొత్తం 15 లక్షల 36 వేల 500 రూపాయలు చెల్లించడం అనేది చిన్న విషయం కాదని.. దీనిని కూడా రాజకీయం చేయడం ఏమిటని కొందరు విమర్శలు చేస్తున్నారు. ఇలా ప్రతి రాజకీయ నేత విద్యార్థులకు అండగా ఉండాలని కోరుతున్నారు. మొత్తానికి బండి సంజయ్ చేసిన ప్రకటన పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్