Sunday, March 22, 2026 01:16 PM
Sunday, March 22, 2026 01:16 PM

కొలికపూడి కథ కంచికి చేరినట్లేనా..?

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కథ ముగిసినట్లేనా అనే ప్రశ్న ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో బాగా వినిపిస్తోంది. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి కొలికపూడి వ్యవహారం టీడీపీ నేతలకు, కార్యకర్తలను ఇబ్బందులు పెడుతూనే ఉంది. పార్టీ అధినేత మాట సైతం లెక్కచేయకుండా కొలికపూడి తనదైన శైలిలోనే వ్యవహరించారు. చివరికి అధినేత చంద్రబాబు సైతం కొలికపూడి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నందిగామ నియోజకవర్గంలో పర్యటించిన సమయంలో కొలికపూడిని చంద్రబాబు కనీసం లెక్క చేయలేదు. పక్కన ఉన్న వారిని నవ్వుతూ పలకరించిన చంద్రబాబు.. తన దగ్గరకు వచ్చిన కొలికపూడి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఈ పరిణామంతో అవాక్కైన కొలికపూడి కొద్ది రోజుల పాటు సైలెంట్‌గానే ఉన్నారు. కానీ విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై కొలికపూడి సంచలన ఆరోపణలు చేయడంతో మరోసారి దుమారం చెలరేగింది.

Also Read : ఒక్క మగాడు ఎలివేషన్.. పిచ్చి పీక్స్..!

తెలుగుదేశం పార్టీ పేరు చెబితే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది క్రమశిక్షణ. పార్టీలో కిందిస్థాయి కార్యకర్త మొదలు.. అధ్యక్షుడి వరకు ప్రతి ఒక్కరు పార్టీ నియమాలు పాటించాల్సిందే. ఎవరు తప్పు చేసిన ఒకే రకమైన చర్యలుంటాయి. క్రమశిక్షణకు మారు పేరైన టీడీపీలో కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. ఎవరైనా తప్పు చేసినా.. మరో నేతపై ఆరోపణలు చేసినా సరే.. క్రమశిక్షణ సంఘం ముందు హాజరై వివరణ ఇచ్చుకోవాలి. ఆ ఆరోపణలు రుజువు చేయకపోతే.. పార్టీ తీసుకునే చర్యలకు కట్టుబడి ఉండాల్సిందే. ఇలా క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరవ్వటం అంటే.. పార్టీ నేతలకు తలవంపులతో సమానం. ఒక్కసారి హాజరయైనా సరే.. అదేదో పెద్ద నేరం అన్నట్లుగా నేతలు భావిస్తారు. మరి అలాంటిది.. కొలికపూడి ఏకంగా మూడు సార్లు పార్టీ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరయ్యారు. నిజానికి ఇప్పటికే రెండుసార్లు కొలికపూడికి పార్టీ పెద్దలు వార్నింగ్ ఇచ్చారనే చెప్పాలి. నియోజకవర్గంలో, జిల్లాలో పార్టీ నేతలతో కలిసి పని చేయాలని..

కానీ కొలకపూడి తీరులో ఎలాంటి మార్పు రాలేదు. మరోసారి విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై అదే తరహా విమర్శలు చేశారు. టికెట్ కోసం డబ్బులు తీసుకున్నారని.. బియ్యం, ఇసుక మాఫియా నడుపుతున్నారని.. వైసీపీ నుంచి వచ్చిన వారికే పదవులిస్తున్నారని.. వైసీపీ నేతలతో కలిసి చిన్ని వ్యాపారాలు చేస్తున్నారని.. ఆరోపించారు. ఈ వ్యవహారం చాలా దూరం వెళ్లింది. ఇద్దరు నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడంతో పార్టీ పరువు బజారున పడింది. దీంతో రంగంలోకి దిగిన చంద్రబాబు.. ఇద్దరు నేతల నుంచి వివరణ తీసుకోవాలని.. సమగ్ర నివేదిక తయారు చేసి తనకు ఇవ్వాలని ఆదేశించారు. దీంతో ముచ్చటగా మూడోసారి క్రమశిక్షణ సంఘం నుంచి కొలికపూడికి కబురు వచ్చింది. ఆధారాలు ఇవ్వాలని కూడా సూచించింది. దీంతో పార్టీ ఆఫీసుకు వచ్చిన కొలికపూడి.. క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరయ్యారు. ఏకంగా 4 గంటల పాటు కొలికపూడిని కమిటీ సభ్యులు విచారించారు. విచారణకు హాజరయ్యేందుకు తన అభిమానులు వంద మందితో వచ్చిన కొలికపూడి.. అనంతరం సైలెంట్‌గా వెళ్లిపోయారు. చివరికి లోపల ఏం జరిగిందనే విషయం కూడా ఎవరికీ చెప్పకుండా సైలెంట్‌గా హైదరాబాద్ వెళ్లిపోయారు.

Also Read : మరో ఎమ్మెల్యేకి టీడీపీ అధిష్టానం క్లాస్..?

ఇక క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరైన ఎంపీ కేశినేని చిన్ని 20 నిమిషాల్లోనే తన వివరణ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాను చంద్రబాబుకు వీర భక్తుడినని.. పార్టీయే తనకు దైవం అన్నారు. తనకు తిరువూరులో జరిగిన అవమానం కంటే.. ఎమ్మెల్యే వల్ల పార్టీకి ఎక్కువ నష్టం జరిగిందని తెలిపారు. నియోజకవర్గం కార్యకర్తల అభిష్టం మేరకే పార్టీ నిర్ణయం ఉంటుందని అనుకుంటున్నా.. అంటూ చిన్ని వ్యాఖ్యానించారు. కొలికపూడిపై చర్యలు తీసుకోకపోతే.. ఇతర నేతలు కూడా తన నోటీకి పని చెప్పే ప్రమాదం ఉందనే మాట పార్టీలో వినిపిస్తోంది. దీంతో కొలికపూడిపై వేటు దాదాపు ఖాయమనే మాట వినిపిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్